Share News

Lok Sabha Polls: కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంపై స్పందించిన మేనకాగాంధీ

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:43 AM

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ (BJP) ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. ఈ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ (Maneka Gandhi) తొలిసారి స్పందించారు.

Lok Sabha Polls: కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంపై స్పందించిన మేనకాగాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ (BJP) ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. ఈ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ (Maneka Gandhi) తొలిసారి స్పందించారు. ఎన్నికల ప్రచారానికి సుల్తాన్‌పూర్‌ చేరుకున్న మేనకా గాంధీ.. తన కుమారుడి టికెట్ విషయమై స్పందించారు. ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నికల తర్వాత చూద్దాం ఏం జరగుతుందోనని అన్నారు. తాను బీజేపీలోనే ఉన్నానని, ఈ పార్టీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వరుణ్ గాంధీ 2009లో పిలిభిత్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో సుల్తాన్‌పూర్‌ నుంచి, 2019లో మరోసారి పిలిభిత్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

సుల్తాన్‌పూర్‌ నుంచి మేనకా..

ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్ టికెట్ వరుణ్ గాంధీకి ఇవ్వనప్పటికీ ఆయన తల్లి సుల్తాన్‌పూర్ సిట్టింగ్ ఎంపీ మేనకా గాంధీకి బీజేపీ టికెట్ కేటాయించింది. గత కొన్నేళ్లుగా సుల్తాన్‌పూర్‌, పిలిభిత్‌ స్థానాలు మేనకాగాంధీ, వరుణ్‌ గాంధీల కంచుకోటగా మారాయి. 2014 ఎన్నికల్లో పిలిభిత్ నుంచి ఎంపీగా గెలిచిన మేనకా గాంధీ 2019లో సుల్తాన్‌పూర్ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ పోటీచేసి గెలుపొందారు.

వరుణ్ వైఖరిపై ఆగ్రహం

వరుణ్ గాంధీ ప్రస్తుత వైఖరిపై పార్టీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వరుణ్ గాంధీ సొంతపార్టీపై విమర్శలు చేస్తున్నారు. యోగి ప్రభుత్వం నిర్ణయాల్లో కొన్నింటిపై అభ్యంతరం తెలిపారు. అలాగే నిరుద్యోగ సమస్యపై ఆయన చేసిన ప్రకటనలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో వరుణ్ గాంధీని బీజేపీ పక్కన పెట్టిందనే చర్చ జరుగుతోంది.

Sumalatha: ఇంకా టిక్కెట్ ఇవ్వలేదు.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా.. సుమలత కామెంట్స్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 07:43 AM