BJP: కాంగ్రెస్ అంటే ఉగ్రవాదం, స్కామ్‌లు.. యోగీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 21 , 2024 | 05:02 PM
లోక్ సభ ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress) అంటేనే ఉగ్రవాదం, స్కామ్‌లు, నక్సలిజానికి పర్యాయపదమని ఆరోపించారు.
రాయ్‌పూర్: లోక్ సభ ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్(Congress) అంటేనే ఉగ్రవాదం, స్కామ్‌లు, నక్సలిజానికి పర్యాయపదమని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ కబీర్‌ధామ్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..
"అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల ఎన్నో ఏళ్ల కల. దాన్ని ప్రధాని మోదీ(PM Modi) సాకారం చేశారు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలు, ఉగ్రవాదం, నక్సలిజానికి పర్యాయపదం. ట్యాబ్స్, పుస్తకం ఉండాల్సిన యువత చేతిలో.. కాంగ్రెస్ పిస్టల్స్ పెట్టింది. నక్సలిజం, ఉగ్రవాదం పేరుతో దేశానికి వ్యతిరేకంగా పోరాడేందుకు వారిని ప్రేరేపించింది. ఆయన నాయకత్వంలో గత 10 ఏళ్లలో దేశం అభివృద్ధి పథంలో పయనించడం ప్రజలు గమనించారు. ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దాలనేది మోదీ సంకల్పం. దేశంలో ప్రతి ఒక్కరికి భద్రత కల్పించేది బీజేపీ మాత్రమే. మా ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చి, రామమందిరాన్ని నిర్మించి, నక్సలిజం సమస్యను తగ్గించి, దేశ పౌరులకు రక్షణ కల్పించింది. సమస్యకు పర్యాయపదం కాంగ్రెస్, సమస్యకు పరిష్కారం బీజేపీ. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి" అని యోగీ పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి