Home » YouTube
యూటూబర్లను ప్రోత్సహించేందుకు యూట్యూబ్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే షార్ట్స్ సహా పలు రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా క్రియేటర్ల కోసం అదిరిపోయే ఫీచర్లను అనౌన్స్ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బిహార్‌లో ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్ చేసి 15 ఏళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నాడు. బిహార్‌లోని సరన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పిల్లల యూట్యూబ్ నియంత్రణ ఇకపై తల్లిదండ్రుల చేతుల్లో ఉండేలా యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కోట్లాది మంది యూట్యూబ్(YouTube) వినియోగదారులకు గూగుల్ పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా కంపెనీ ప్రీమియం ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్లాన్ల ధరలను 58 శాతం వరకు పెంచడం విశేషం. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం పంట రుణాల మాఫీ వివరాలను తెలుసుకోవడానికి వచ్చిన మిర్రర్ టీవీ విజయారెడ్డి, సిగ్నేచర్ టీవీ సరిత, ఇతర యూట్యూబర్లను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
వ్యూస్, లైక్‌లు, సబ్‌స్ర్కైబర్ల పిచ్చితో కొందరు యూట్యూబర్లు విచక్షణను మరిచి నచ్చిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.
యూట్యూబ్(YouTube) మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ(56)(Susan Wojcicki) కన్నుమూశారు. ఈ క్రమంలో ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్బుక్ భావోద్వేగ పోస్ట్ చేసి ఈ విచారకరమైన వార్తను షేర్ చేశారు. ఈ ఘటనపై గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్(Sundar Pichai) శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా స్పందించారు.
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ అనారోగ్యంతో కన్నుమూశారు. రెండేళ్ల నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. యూట్యూబ్‌కు పాపులారిటీ తీసుకొచ్చేందుకు సుసాన్ కృషి చేశారు. సుసాన్ కన్నుమూశారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికలు రావటంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది.
టిబెట్ భాషలోని కంటెంట్‌ని నిషేధిస్తూ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిబెట్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.