YouTube New Feature: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. AI తో ఫ్రీగా మ్యూజిక్ సృష్టించే ఛాన్స్..
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:01 PM
YouTube New AI Music Tool: యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ల మ్యూజిక్ లేదా వీడియోలు నచ్చినట్టుగా వాడే అవకాశం ఉండదు. కానీ, YouTube కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్ సాయంతో కాపీరైట్ భయం లేకుండా హ్యాపీగా మీకు మీరే ఉచితంగా సంగీతం సృష్టించుకోవచ్చు.

YouTube New AI Music Creation Tool: యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ క్రియేటర్స్ కోసం కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్ సాయంతో ఇక కంటెంట్ క్రియేటర్స్ వారి వీడియోల కోసం కస్టమ్, రాయల్టీ భయం లేకుండా సొంతంగా మ్యూజిక్ రూపొందించుకోవచ్చు.అదీ చాలా సులభంగా. ఈ కొత్త ఫీచర్ YouTube స్టూడియోలోని క్రియేటర్ మ్యూజిక్ ట్యాబ్‌లో ప్రతి ఒక్క కంటెంట్ సృష్టికర్తలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఫీచర్ కొన్ని రోజుల్లోనే అందరికీ పూర్తిఅందుబాటులోకి రానుంది.
AI మ్యూజిక్ జనరేషన్ అంటే ఏమిటి?
యూట్యూబ్ తన క్రియేటర్ ఇన్‌సైడర్ ఛానెల్‌లోని వీడియో ద్వారా ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. ఈ AI సాధనం లక్ష్యం సృష్టికర్తలకు వారి వీడియోలకు జోడించడానికి మరింత మెరుగైన మ్యూజిక్ ఆప్షన్స్ అందించడమే. అదీ ఎటువంటి కాపీరైట్ సమస్యలు లేకుండా.
క్రియేటర్ మ్యూజిక్ ట్యాబ్‌లో కొత్త మార్పు
క్రియేటర్ మ్యూజిక్ ట్యాబ్‌లో ఇప్పటికే కాపీరైట్ రహిత మ్యూజిక్ లైబ్రరీ అందుబాటులో ఉంది. దీనిలో వినియోగదారులు శైలి, మానసిక స్థితి, వాయిస్, BPM, డ్యురేషన్ మొదలైన వాటి ఆధారంగా మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే, కొన్ని ట్రాక్‌లకు డబ్బు చెల్లించాల్సి రావచ్చు.తాజాగా ఈ ట్యాబ్‌కు AI ఆధారిత "మ్యూజిక్ అసిస్టెంట్" అనే కొత్త ఫీచర్ యాడ్ చేశారు. దీనిలో, జెమిని స్పార్కిల్ ఐకాన్‌తో కూడిన పేజీ ఉంది. ఇక్కడ యూజర్స్ వీడియో టాపిక్, లెంగ్త్ మొదలైన వాటికి ఎలాంటి సంగీతం కావాలో టెక్స్ట్‌లో ద్వారా తెలపాల్సి ఉంటుంది. ఈ సాధనాన్ని ఏ AI మోడల్ అమలు చేస్తుందో కంపెనీ వెల్లడించలేదు. కానీ సిస్టమ్‌ను మెరుగుపరచడానికి యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్‌లు 30 రోజుల పాటు సర్వర్‌లో కచ్చితంగా సేవ్ అయి ఉంటాయన YouTube చెబుతోంది.
Read Also: AI Aadhaar card: బీ అలర్ట్.. AIతో నకిలీ ఆధార్ కార్డులు.. ఎలా గుర్తించాలంటే..
ఇది కదా టెక్నాలజీ అంటే.. 3Dతో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ కట్టేశారు..
AC Buying Tips: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. రెండింటిలో ఏది బాగా కూల్ చేస్తుంది..