YouTuber: యూట్యూబర్ దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను
ABN , Publish Date - Apr 16 , 2025 | 10:41 AM
సోషల్ మీడియా పిచ్చి.. ఆమె జీవితాన్ని నాశనం చేసింది. వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన మహిళ ఇప్పుడు పోలీసు స్టేషన్‌లో ఊచలు లెక్కిస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే..

చంఢీగర్: ఆడవారిలో కూడా నేర ప్రవృత్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. అనైతిక బంధాల మోజులో పడి.. కట్టుకున్న వాడిని, కడుపున పుట్టిన పిల్లలను సైతం అంతమొందిస్తున్నారు. నెల రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో.. ఇద్దరు మహిళలు లవర్‌తో కలిసి వారి భర్తలను హత్య చేసిన సంఘటనలు చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం మరొకటి వెలుగు చూసింది. రీల్స్, యూట్యూబ్ వీడియోల కోసం ఓ వ్యక్తితో వివాహతకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. భర్తకు ఈ విషయం తెలియడంతో.. లవర్ సాయంతో అతడిని హత్య చేసింది ఆ మహిళ. ఆ వివరాలు..
ఈ దారుణం హరియాణా, హిసార్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రేమికుడితో రెడ్ హ్యాండెడ్‌గా భర్తకు పట్టుబడిన ఓ మహిళ.. దారుణానికి ఒడిగట్టింది. చున్నీతో భర్త గొంతు నులిమి.. హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రవీనా(32) అనే మహిళకు ప్రవీణ్ అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. సోషల్ మీడియా రాకముందు వరకు కూడా వీరి కాపురం సాజావుగానే సాగింది. ఎప్పుడైతే రవీనాకు రీల్స్ పిచ్చి పట్టిందో.. అప్పుటి నుంచి వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి.
భర్త అభ్యంతరం చెప్పినా..
సోషల్ మీడియా పిచ్చితో రవీనా డ్యాన్స్ వీడియోలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసేది. ఈ క్రమంలో ఆమెకు సురేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి హరియాణా ప్రేమ్ నగర్ ప్రాంతంలో షార్ట్ వీడియోలు షూట్ చేసేవారు. ఏడాదిన్నర నుంచి వీళ్లు ఇలా వీడియోలు చేస్తున్నారు. ప్రవీణ్, అతడి కుటుంబ సభ్యులకు రవీనా చేసే పనులు నచ్చేవి కావు అభ్యంతరం చేప్పేవారు. అయినా రవీనా తన తీరు మార్చుకోలేదు. ఈ విషమై భార్యాభర్తలిద్దరి మధ్య చాలా సార్లు గొడవ కూడా జరిగింది. అయినా లాభం లేకపోయింది. రవీనా వీడియోలు చేస్తూ పోతూనే ఉంది. ఇక ఇన్‌స్టాలో ఆమెకు 34 వేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేయడం ప్రారంభించింది.
రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో..
రవీనాకు సురేష్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం అనగా మార్చి 25, 2025 నాడు సురేశ్, రవీనా ఇద్దరు అభ్యంతకర పరిస్థితిలో ప్రవీణ్ కంట పడ్డారు. దాంతో వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ప్రవీణ్ బతికి ఉంటే తమకు ఎప్పటికైనా అడ్డే అని భావించిన రవీనా, సురేష్‌లు.. చున్నీతో అతడి గొంతు నులిమి హత్య చేశారు. ప్రవీణ్ డెడ్ బాడీని ఎవరి కంటపడకుండా దాచి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
రాత్రైనా ప్రవీణ్ ఇంటికి రాకపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రవీనాను అడగ్గా.. ఆమె తనకేం తెలియదని చెప్పింది. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన రవీనా.. సురేష్‌తో కలిసి ప్రవీణ్ డెడ్ బాడీని తీసుకుని బైక్ మీద పెట్టుకుని.. వారి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దిన్నోడ్ రోడ్డు ప్రాంతంలోని ఓ మురికి కాల్వలో పడేసి.. తిరిగి ఇంటికి వచ్చారు.
మార్చి 28న ప్రవీణ్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలను పరిశీలించగా.. రవీనా, సురేశ్ ఇద్దరు కలిసి.. ప్రవీణ్ డెడ్ బాడీని బైక్ మీద తరలించడం గమనించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు జైలులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Hyderabad: నీ తెలివి పాడుగాను.. కోళ్ల గంపలో పిల్లలను పెట్టి
Reels: రీల్స్ పిచ్చితో వార్డ్ బాయ్ అత్యుత్సాహం.. కట్ చేస్తే