Home » YS Jagan Mohan Reddy
Andhrapradesh: టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థలకు రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని టీడీపీ నేత రెడ్డెప్పగారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్వహణ చేతకాక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఏపీలో 13 జిల్లాల్లో వైసీపీ నేతలకు నచ్చిన వారికి ఇసుక రీచ్‌లు కట్టబెట్టి దోపిడీ చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని.. వారి కోసం కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నేతలు కలిసి నడవాలని దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు.
Andhrapradesh: ‘‘జగన్‌కు కులమే లేదు. కులదైవం ఎక్కడి నుంచి వస్తుంది. కడప అనేది దేవుని గడప. దుర్మార్గులు కడప పేరును మార్చారు. కడపకు వైయస్సార్ జిల్లా అని పేరు పెట్టుకున్నారు. పవిత్రమైన కడప పేరును బ్రిటిష్ వాళ్ళు కూడా మార్చడానికి సాహసం చేయలేదు’’..
Andhrapradesh: జగన్ రేపు (శనివారం) శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుమలకు జగన్ రానున్న నేపథ్యంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. అన్యమతస్తుడైన జగన్.. శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Andhrapradesh: తిరుమలలో పలువురు స్వాములు నిరసనకు దిగారు. గో బ్యాక్ జగన్ అంటూ గురువారం అలిపిరి వద్ద శ్రీనివాస ఆనంద స్వామీజీతో పాటు పలువురు స్వాములు ఆందోళనకు చేపట్టారు. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లే కార్డ్స్‌తో నినాదాలు చేశారు.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.
తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. అనుమానం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) జరిపారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.
అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వివరించారు. ధాన్యం బకాయిలు వైసీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కూటమి ప్రభుత్వం రూ. 1600 కోట్ల రైతు బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. ఆధునిక టెక్నాలజీ డ్రోన్ ద్వారా పంటలకు పురుగు మందులు పిచికారీ చేసే విధానంతో మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా చెల్లిస్తున్నాయని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు.