Share News

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ABN , Publish Date - Sep 26 , 2024 | 10:59 AM

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
Balineni Srinivas Reddy

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.

Also Read: Gold and Silver Rates Today: చరిత్రలోనే తొలిసారి.. భారీగా పెరిగిన బంగారం ధరలు..


దీంతో బాలినేని సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్ జగన్ అడుగులో అడుగు వేసి నడిచారు. ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్‌లో స్థానం సంపాదించారు. రెండున్నరేళ్ల తర్వాత జగన్ కేబినెట్‌ను పునర్ వ్యవస్థకీరించారు. దీంతో మంత్రి పదవిని బాలినేని కోల్పోయారు.

Also Read: 3D Printed Hotel: ప్రపంచంలోనే తొలి త్రీడి ప్రింటింగ్ హోటల్


అయితే వైఎస్ జగన్ కుటుంబంతో బాలినేనికి సమీప బంధుత్వం ఉంది. అయినా ఆయన్ని కేబినెట్‌ నుంచి తొలగించడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యారనే గట్టి ప్రచారం అయితే జిల్లా గట్టిగానే సాగింది. అందువల్లే నాటి నుంచి పార్టీ అధిష్టానానికి ఆయన సాధ్యమైనంత దూరంగా ఉన్నారనే చర్చ సైతం సాగింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమైంది. ఎమ్మెల్యేగా సైతం బాలినేని ఓటమి పాలయ్యారు.


పార్టీ వీడేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌ వద్ద కుండ బద్దలు కొట్టారు. బాలినేనికి నచ్చ జెప్పేందుకు పార్టీ అధినేతే కాదు.. అగ్రనేతలు సైతం ప్రయత్నించారు. కానీ బాలినేని మాత్రం వారి సూచనలు సలహాలు పట్టించుకోలేదు.


rajini.jpg

రజనీ రాయబారం..

దీంతో మాజీ మంత్రి విడదల రజనీని రంగంలోకి దింపారు. రజనీ రాయబారం చేసినా... బాలినేని మాత్రం మెత్తబడలేదు. ఆ కొద్ది రోజులకే తాను జనసేనలో చేరుతున్నట్లు బాలినేని ప్రక్రటించారు. ఈ నేపథ్యంలో గురువారం బాలినేని జనసేన పార్టీ కుండువా కప్పుకోనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం వైసీపీలోకి మారి... తాజాగా జనసేన గూటికి బాలినేని చేరుతున్నారు.


బాలినేని సూపర్ డూపర్ ఫేమస్ అయింది మాత్రం అప్పడే..

అయితే ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫేమసే అయినా.. జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సమయంలో మాత్రం బాలినేని సూపర్ డూపర్ ఫేమస్ అయ్యారు.ఎలా అంటే.. 2021 డిసెంబర్‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.


gupta.jpg

గుప్తా కీలక వ్యాఖ్యలు

ఒంగోలులో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బాలినేని అనుచరుల్లో ఒకరైన సుబ్బారావు గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ విషయం తెలిసిన సుబ్బారావు గుప్తా ప్రాణ భయంతో అదృశ్యమైయారు. ఆ క్రమంలో బాలినేని అనుచరులు రంగంలోకి గుప్తా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


చివరకు గుంటూరులో ఉన్న సుబ్బారావు గుప్తాను పట్టుకుని బాలినేని ప్రధాన అనుచరులు సుభానీ చావ గొట్టి.. అతడితో సారీ చెప్పించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలినేని ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.


yv subba.jpg

వైవీ సుబ్బారెడ్డితో బంధుత్వం

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని శ్రీనివాసరెడ్డి పెళ్లి చేసుకున్నారు. గతంలో ఈ బావ బావమరిది మధ్య బంధం బలంగానే ఉండేది. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని, ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి విజయం సాధించారు. దీంతో జిల్లాలో ఆధిపత్యం కోసం జరిగిన పోరులో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిందనే ఓ చర్చ ప్రకాశం జిల్లాలో ఉంది. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి పోవడం వెనక వైవీ సుబ్బారెడ్డి ఉన్నారని బాలినేని నమ్ముతారని ఆయన అనుచర వర్గంలో ప్రచారం జరిగింది.

For More AP News And Telugu News

Updated Date - Sep 26 , 2024 | 11:17 AM