TDP: వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్టుల పరిస్థితి
ABN , Publish Date - Sep 27 , 2024 | 04:49 PM
Andhrapradesh: టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థలకు రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని టీడీపీ నేత రెడ్డెప్పగారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్వహణ చేతకాక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 27: గత ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి (Former CM YS Jagan Reddy) నీటి పారుదల వ్యవస్థల్ని నాశనం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి (TDP Leader Reddappagari Srinivas Reddy) విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ది దిశగా నడిపిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థలకు రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.
YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్
గత ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్వహణ చేతకాక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఉందని వ్యాఖ్యలు చేశారు. హంద్రీ-నీవాకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4,182 కోట్లు ఖర్చు చేశారని.. జగన్ రెడ్డి ప్రభుత్వం హంద్రీ - నీవాకు కేవలం రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో నీటి పారుదల వ్యవస్థకు జీవోలు విడుదల చేయడమే తప్ప వాటిని పూర్తి చేసింది లేదన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు 75 శాతం పూర్తి చేస్తే మిగిలిన 25 శాతం పూర్తి చేయడానికి జగన్ రెడ్డి వాయిదాలు వేస్తూ కాలం వెల్లబుచ్చారన్నారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే రాష్ట్ర ప్రజలకు నీటి కొరత ఉండేది కాదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తే జగన్ రెడ్డి దానిని కూడా సర్వనాశనం చేశారని విమర్శించారు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే డయాఫ్రం వాల్ మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టే పరిస్తితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో రివర్స్ టెండరింగ్ చేసి నిధులు దోచుకున్నారని ఆరోపించారు.
Big Breaking: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
జగన్ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డ్యాం గేటు కోట్టుకుపోయిందన్నారు. కనీసం ప్రాణాలు కోల్పోయినవారికి నష్ట పరిహారం కూడా అందించని నీచుడు జగన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి కూడా నష్టపోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందించారని గుర్తుచేశారు. విజయవాడలో విపత్తు సమయంలో నిద్రాహారాలు మానేసి ప్రజల శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
AP-Karnataka: ఏపీ, కర్నాటక ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం.. ఏ విషయంలో అంటే
YS Sharmila: డిక్లరేషన్‌పై మీడియా ప్రశ్న.. షర్మిల సమాధానం ఇదే..
Read Latest AP News And Telugu News