Home » YS Jagan Mohan Reddy
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్స్టాప్ పడింది. జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.
వైఎస్ ఫ్యామిలీలో విబేధాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ ఉప్పు-నిప్పులానే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు.. ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి..
ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత ఐదేళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100పడకల హాస్పిటల్ భవనాన్ని, ల్యాబ్స్, డయోగ్నస్టిక్,సెంటర్లని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం నాడు ప్రారంభించారు.
వైయస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పక్కన పెట్టారు. దీంతో అధికారం దూరమైన జస్ట్ 60 రోజుల్లో వైయస్ జగన్ దాదాపు 6 సార్లు... తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం కట్టారని సమాచారం.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికలలో వైసీపీ కాళ్లు, కీళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టినా జగన్‌లో ఇంకా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగబోమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు, క్యాడర్‌కు ఇదే విషయాన్ని చెప్పారు.
Andhrapradesh: గతంలో మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణం కోసం తొలగించిన భరతమాత విగ్రహన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో నాలుగురోడ్లు, మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్లైడింగ్ పార్కు ఏర్పాటు కోసం భరతమాత విగ్రహాన్ని అప్పటి సీఎం జగన్ తొలగించి వేశారు. భరతమాత సెంటర్లో విగ్రహాన్ని తొలగించడానికి వీలులేదని అప్పట్లో స్థానికులు ఆందోళనలు కూడా చేశారు.
Andhrapradesh: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నీ ఐదేళ్ల పాలనలో చేసిన మంచి అంటే ప్రజల భూములను కబ్జా చేయడం... ప్రశ్నించిన వారిని చంపేయడమా జగన్ రెడ్డి. నీవు అంతగా ప్రజలకు మంచి చేసి ఉంటే నీ పార్టీని ఎందుకు అత్యంత ఘోరంగా 11 సీట్లకే పరిమితం చేశారు’’ అని ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) ఆరోపించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు మూడు నెలల పాటు నిలిపివేసినట్లు వివరించారు.