Share News

Minister Anagani: వైసీపీ నేతలు అసైన్డ్ భూములను కొట్టేశారు

ABN , Publish Date - Aug 13 , 2024 | 10:52 AM

జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) ఆరోపించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు మూడు నెలల పాటు నిలిపివేసినట్లు వివరించారు.

Minister Anagani: వైసీపీ నేతలు అసైన్డ్ భూములను కొట్టేశారు
Minister Anagani Satya Prasad

అమరావతి: జగన్ ప్రభుత్వం లో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) ఆరోపించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు మూడు నెలల పాటు నిలిపివేసినట్లు వివరించారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకుని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుంచి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని విమర్శించారు.


నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారని మండిపడ్డారు.కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారని చెప్పారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ర్టేషన్లు చేశారని తెలిపారు. రిజిస్ర్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ డిడ్లు‌గా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని విమర్శలు చేశారు.


20 ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారముంది అని చెప్పారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేసేందుకే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.


చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

మరోవైపు... విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూరంగా ఉండనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు నిర్ణయంతో పోటీకి దూరంగా కూటమి నేతలు ఉండనున్నారు. మంగళవారం నాడు టెలికాన్పరెన్స్‌లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు అత్యంత హూందాగా వ్యవహరించారని కూటమి నేతలు కొనియాడారు. అధికారంలో ఉండి... గెలిచే అవకాశం ఉన్నా రాజనీతిజ్ఞుడిలా చంద్రబాబు వ్యవహరించారని నేతలు ప్రశంసలు కురిపించారు.


గెలవాలంటే పెద్ద కష్టం కాదు...కానీ హూందా రాజకీయాలు చేద్దామని నేతలతో అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి పక్షనేతలు, జిల్లా నేతలు ఆమోదించారు. నాటి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నాడు ఎన్నికల్లో పోటీకీ దూరంగా టీడీపీ ఉందని చెప్పారు. అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వచ్చారని వివరించారు. గెలుపు కాదు ప్రజల అభిప్రాయలు, విలువలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణం అన్నివర్గాల అభివృద్ధి అని చంద్రబాబు ఈ సమావేశంలో కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 11:10 AM