Share News

Gottipati: ఆ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:22 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.

Gottipati: ఆ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
Minister Gottipati Ravikumar

అమరావతి, ఆగస్టు 20: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌పై (Veligonda Project) మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.

CM Revanth Reddy: తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదు


ఆనాడు చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలుగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టావంటూ జగన్‌పై దుయ్యబట్టారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన చరిత్ర వైసీపీది అని వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha: కవితకు మళ్లీ షాక్.. బెయిల్ విషయంలో పదే పదే నిరాశ..


గుండ్లకమ్మ గేటు పోయి మూడు సంవత్సరాలైనా పెట్టలేని పరిస్థితి వైసీపీదన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని, పులిచింతల గేటు కొట్టుకుపోయిందన్నారు. వైసీపీ ఇసుక దోపిడీతో ప్రాజెక్టుల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్లపాటు నోరు తెరవకపోవటం మంచిదని.. లేకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

Farmers: అనంతలో రైతుల ఆందోళన.. కారణమిదే!

AP News: అనకాపల్లి ఫుడ్ పాయిజన్‌పై పాస్టర్ భార్య సమాధానం ఇదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 01:31 PM