Home » YS Sharmila
కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీని వైఎస్ షర్మిల పరిశీలించారు.
బాలీవుడ్ నటి జైత్వానీ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. మాజీ జగన్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఆయనకూ ఇద్దరు ఆడబిడ్డలున్నారు కదా? అని ప్రస్తావిస్తూ..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి అర్పించారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekar Reddy) వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు.
Andhrapradesh: వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తొలగించడాన్ని.. కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని విష జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తుంటే.. కూటమి సర్కారుకి కనీసం సూది గుచ్చినట్టయినా లేదని ఆరోపించారు.
అదానీని కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు చేశారు. గురువారం నాడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
వైఎస్ ఫ్యామిలీలో విబేధాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ ఉప్పు-నిప్పులానే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు.. ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి..
Andhrapradesh: రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరులకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నా జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ .. రక్త సంబంధం లేకపోయినా.. వైఎస్సార్ అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగ నిలబడి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ... రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. గ్రూప్-2 డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో అనుసరిస్తున్నట్లుగానే..