Share News

YS Sharmila: జగన్‌ బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:01 PM

Andhrapradesh: వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తొలగించడాన్ని.. కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోందన్నారు.

YS Sharmila: జగన్‌ బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు
APCC Chief YS Sharmila

విజయవాడ, ఆగస్టు 31: వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ (Former CM Jagan) ఆనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తొలగించడాన్ని.. కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోందన్నారు. ఎన్టీఆర్ అయినా వైఎస్సార్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే అని చెప్పుకొచ్చారు.

RK Roja: వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా..


పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు. వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్,పెన్షన్లు ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శమన్నారు. వైఎస్సార్ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదని.. తెలుగు వారి ఆస్తి... తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలమన్నారు. వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్సార్ మీద రుద్దడం సరికాదన్నారు. వైసీపీలో వైఎస్సార్‌ లేరని... అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డి పార్టీనే అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?

Heavy Rains: వరద ఉధృతి.. వాగు దాటేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2024 | 01:12 PM