YS Sharmila: ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:08 PM
Andhrapradesh: రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరులకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నా జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ .. రక్త సంబంధం లేకపోయినా.. వైఎస్సార్ అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగ నిలబడి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ... రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
అమరావతి, ఆగస్టు 19: రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరులకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి (APCC CHief YS Sharmila Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నా జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ .. రక్త సంబంధం లేకపోయినా.. వైఎస్సార్ అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగ నిలబడి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ... రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని తెలిపారు.వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం అని అన్నారు. ‘‘దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నా ప్రార్ధన’’ అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Kamala Harris: కమలా హ్యారిస్‌కు గుడ్‌న్యూస్.. తాజా సర్వే ఏం చెబుతోందంటే?
అలాగే రాఖీ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే అని అన్నారు. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశామన్నారు. ‘‘ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ... ఈ ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Seethakka: ఆడబిడ్డలను ఎగరనిద్దాం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు
మహిళాలోకానికి శుభాకాంక్షలు: పవన్
అలాగే రక్షాబంధన్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ అని అన్నారు. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక అని వెల్లడించారు. ఈ పర్వదినం సందర్భంగా అక్కాచెల్లెళ్లు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Seethakka: ఆడబిడ్డలను ఎగరనిద్దాం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు
Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!
Read Latest AP News And Telugu News