Home » YS Sharmila
చిత్తూరు జిల్లాలో షర్మిల ప్రచార సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని తాజా ఎన్నికలు నిరూపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓట్లు పెరగడం తప్ప ఏ నియోజకవర్గంలోనూ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధులకు దక్కలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ కాంగ్రెస్ (AP Congress) నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసింది. పార్టీపై, నేతలపై బహిరంగ విమర్శలు చేయకూదని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆఫీస్ బేరర్లు ఇష్టానుసారంగా మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారని అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది.
అమరావతి: రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..
రాజకీయాల్లో మనుగడ అనేది ఎంతో ముఖ్యం.. రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది అదే. ఓ నాయకుడు తీసుకునే నిర్ణయాలు పార్టీ మనుగడను నిర్దేశిస్తాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కానీ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైనప్పుడు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) దివికేగారు. ఈ రోజు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర కార్యాలయం సాక్షిగా రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు.
విజయవాడ: రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.
అయిపోయింది.. అంతా అయిపోయింది. రాజన్న ముద్దుబిడ్డ.. గారలపట్టి వైయస్ షర్మిలకు మాత్రం రాజకీయ యోగం లేకుండా పోయిందని మహానేత వైయస్ఆర్ అభిమానుల్లో ఓ చర్చ అయితే వాడివేడిగా సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు.