YSRCP Future: వైసీపీ భవిష్యత్తు ఏమిటి.. జగన్ తదుపరి నిర్ణయం అదేనా..!
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:28 PM
రాజకీయాల్లో మనుగడ అనేది ఎంతో ముఖ్యం.. రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది అదే. ఓ నాయకుడు తీసుకునే నిర్ణయాలు పార్టీ మనుగడను నిర్దేశిస్తాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కానీ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైనప్పుడు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
రాజకీయాల్లో మనుగడ అనేది ఎంతో ముఖ్యం.. రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది అదే. ఓ నాయకుడు తీసుకునే నిర్ణయాలు పార్టీ మనుగడను నిర్దేశిస్తాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కానీ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైనప్పుడు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సొంత పార్టీ నాయకులే అధినాయకుడిని కాదని తలోదారి చూసుకుంటారు. ఈ సందర్భంగా అధినాయకుడు తీసుకునే నిర్ణయమే పార్టీ భవిష్యత్తును.. నాయకుల రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పనైపోయిందని ఎంతోమంది వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు మళ్లీ కోలకోవడం కష్టమని భావించారు. కానీ రాజకీయాల్లో తనకున్న అనుభవం రీత్యా చంద్రబాబు నాయుడు తన నిర్ణయాలతో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు విమర్శించినా.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రజలు ప్రతిపక్షంగా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించారు. ప్రజల పక్షాన నిలిచారు. దీంతో ఐదేళ్లు తిరగేసరికి ప్రజలు అనూహ్య విజయాన్ని అందించారు. ఐదేళ్ల క్రితం పార్టీ మనుగడ కష్టమని మాట్లాడిన నోళ్లు.. ఈరోజు దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించబోతుందని.. భవిష్యత్తు అంతా ఆ పార్టీదేనంటూ ప్రశంసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అపార అనుభవం, నాయకత్వ లక్షణాలే తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిని చేశాయి.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో చర్చంతా వైసీపీ రాజకీయ భవిష్యత్తుపైనే.. 2011లో వైసీపీని ప్రారంభించిన జగన్.. 2014 ఎన్ని్కల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీని నిలిపారు. 2019లో జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఘన విజయాన్ని అందించి ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. కానీ నాడు ప్రశంసలు కురిపించిన వాళ్లే నేడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ భవిష్యత్తు ముగిసినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనంటూ ఇప్పటినుంచే ప్రకటిస్తున్నారు. దీనికి ఊదాహరణగా 2019లో టీడీపీని ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ జగన్‌ను చంద్రబాబుతో పోల్చలేము.. రాజకీయంగా జగన్‌కు పెద్దగా అనుభవం లేదు. పాలనాపరంగా చూసినా జగన్‌లో పరిపక్వత కనిపించదనే విమర్శలు వినిపిస్తాయి. అహంకారంతో కూడిన వ్యక్తిత్వమనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో వైసీపీని జగన్ నడిపించడం కష్టమనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
AP Politics: వైసీపీని ఓడించింది వాళ్లే.. జగన్ తీరుపై సొంత నేతల ఆగ్రహం..
క్లోజ్ అయినట్లేనా..!
వైసీపీ అధినేత జగన్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. జగన్ నాయకత్వంపై అనేక ఆరోపణలు వినిసిస్తున్నాయి. మరోవైపు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదాను ఇవ్వలేదు. దీంతో జగన్ ప్రతిపక్ష నాయకుడిగానూ అనర్హుడంటూ ప్రజలు తీర్పు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఇంతటి ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జగన్ నాయకత్వంపై విశ్వాసం తగ్గుతుందని.. సొంత పార్టీ నేతలు పార్టీని వీడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అదే జరిగితే వైసీపీ మరింత బలహీనపడుతుందని.. ఆ పార్టీ వచ్చే ఐదేళ్లలో నామరూపాలు లేకుండా పోతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Congress: ఢిల్లీ అశోక హోటల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
చెల్లి బాటలో పయనిస్తారా..
జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటుచేశారు. ఇక్కడి ప్రజల కోసం పోరాడతానంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ లేకపోవడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. తన తండ్రి మరణం తర్వాత వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్‌ను విబేధించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్‌ను షర్మిల విబేధించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ఏపీలో ఆపార్టీ బలం లేకపోయినా.. కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి నష్టం లేదు. వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడంతో మనుగడ సాగించడం కష్టతరం కానుంది. సొంత పార్టీ నేతలు దూరమైతే.. జగన్ సైతం చెల్లి బాటలో పయనించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్‌లో ఎక్కువమంది జగన్‌తో ప్రయాణించారు. మరోసారి వైసీపీ కాంగ్రెస్‌లో విలీనమైతే.. వైసీపీ క్యాడర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడం ద్వారా ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పుంజుకునే అవకాశం ఉండవచ్చని వైసీపీ అధినేత జగన్ ఆలోచిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జగన్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఓ రకమైన ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయపార్టీ అండఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది.
Chennai: అన్నామలైకి కేంద్రమంత్రి పదవి? అదేగాని జరిగితే ఇక రాష్ట్రంలో అధికారపార్టీకి...
విలీనం తప్పదా..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏపీలో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో స్నేహం చేయడం బెటర్ అనే ఆలోచన చాలామంది వైసీపీ నాయకుల్లో ఉంది. కానీ వైసీపీని తమ కూటమిలో చేర్చుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవచ్చు. కేంద్రంలో కమలం పార్టీకి అధికారానికి అవసరమైన మెజార్టీ లేదు. దీంతో టీడీపీ, జేడీయూ మద్దతు తప్పనిసరి. ఒకవేళ వైసీపీని ఎన్డీయే చేర్చుకుంటే టీడీపీ దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వైసీపీని బీజేపీ దగ్గరకు చేరనిచ్చే అవకాశం లేదనే చర్చ వినిసపిస్తోంది. ఇక జగన్‌కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్.. అందుకే వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. పార్టీ పీసీసీ బాధ్యతలు జగన్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Ganababu: మరో నెలలో వైసీపీ సగం ఖాళీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News