AP Congress: ఏపీ కాంగ్రెస్ నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరిక..
ABN , Publish Date - Jun 09 , 2024 | 02:52 PM
ఏపీ కాంగ్రెస్ (AP Congress) నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసింది. పార్టీపై, నేతలపై బహిరంగ విమర్శలు చేయకూదని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆఫీస్ బేరర్లు ఇష్టానుసారంగా మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారని అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది.
అమరావతి: ఏపీ కాంగ్రెస్ (AP Congress) నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసింది. పార్టీపై, నేతలపై బహిరంగ విమర్శలు చేయకూదని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆఫీస్ బేరర్లు ఇష్టానుసారంగా మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారని అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి సీడీ మెయ్యప్పన్ వివరణ ఇచ్చారు. పార్టీకి చెందిన కొంతమంది టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని మెయ్యప్పన్ తెలిపారు.
ఫిర్యాదులను పార్టీ ఫోరమ్‌లో చర్చించాలి తప్ప మీడియాకు ఎక్కొద్దన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా సోషల్ మీడియా ద్వారా స్పందించడం సరికాదని అధిష్ఠానం తెలిపినట్లు ఆయన వివరించారు. గీత దాటితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో పార్టీ సభ్యులు తమ ఫిర్యాదులను మీడియాకు తీసుకెళ్లడం మానుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
అయితే రెండ్రోజుల కిందట ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులు విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS sharmila)పై రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని.. అధిష్ఠానం ఎన్నికల కోసం నిధులు పంపిస్తే షర్మిల దాచుకున్నారని సుంకర పదశ్రీ (Sunkara Padmashri) చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ప్రకటన రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.