Home » YS Sunitha Reddy
వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి.. అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం.. వీలైతే జగన్‌ను ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే తన లక్ష్యం అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని ఆమె అన్నారు.
కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.
Andhra Pradesh News: వైఎస్ జగన్ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని జగన్‌ను(YS Jagan) నిలదీశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత..
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వ్యాఖ్యలు చేసింది. ‘‘ మా అన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దు’’ అని ఆమె కోరారు. తన తండ్రి వివేకాకి జరిగినట్లు మరెవ్వరికీ జరగకూడదని, నిందితులకు శిక్షపడాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన స్మారక సభలో ఆమె మాట్లాడారు.
సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్యను నాటి విపక్ష నేత జగన్ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. చంద్రబాబే(Chandrababu) హత్య చేయించారంటూ జగన్ శిబిరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కట్టుకథలు వండి వార్చింది. వివేకా హత్య జగన్‌కు(YS Jagan) సానుభూతి అస్త్రంగా మారి గెలుపులో కీలకపాత్ర పోషించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయిన ఈ అంశం.. ఈ ఎన్నికల్లో మైనస్ కానుంది. వైఎస్ వివేకా కుటుంబం రాజకీయాల్లోకి వస్తోందంటూ కొద్ది రోజులుగా ఏపీలో ప్రచారం జరుగుతోంది.
సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హానీ జరిగినా.. దానికి జగన్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారన్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుపై సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకా కేసులో తన ప్రమేయం లేదని నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. వివేక కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి అడిగే ప్రశ్నలకు సీఎం జగన్(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి (TulasiReddy) ప్రశ్నించారు.
వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Case) అప్రూవర్ దస్తగిరి (Dastagiri) చేసిన ఆరోపణలపై దేవిరెడ్డి శంకర్ రెడ్డి (Devireddy Shankar Reddy) కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి (Chaitanya Reddy) తాజాగా స్పందించారు. తాను కడప సెంట్రల్ జైలుకు (Kadapa Central Jail) మెడికల్ క్యాంపు కోసం వెళ్లానని, జైల్లో ఉండే వారి ఆరోగ్య పరీక్షల నిమిత్తమే అక్కడికి వెళ్లానని తెలిపారు. తాను నిజంగానే దస్తగిరిని జైల్లో బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.