YS Sunita Reddy: వివేకా హత్య కేసులో సంచలన విషయాలు బయట పెట్టిన సునీతారెడ్డి
ABN , Publish Date - Apr 07 , 2024 | 05:48 PM
మాజీమంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి (YS Sunita Reddy) బయటపెట్టారు. పక్కా స్కెచ్ వేసి తన నాన్నను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకాను సీఎం జగన్ పక్కన పెట్టాలని చూశారని.. అయినా ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. వారి అరాచకాలకు అడ్డువస్తున్నారనే అక్కసుతో హత్య చేయించారని ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలన్నదే వివేకా కోరిక అని చెప్పారు.
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి (YS Sunita Reddy) బయటపెట్టారు. పక్కా స్కెచ్ వేసి తన నాన్నను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకాను సీఎం జగన్ పక్కన పెట్టాలని చూశారని.. అయినా ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. వారి అరాచకాలకు అడ్డువస్తున్నారనే అక్కసుతో హత్య చేయించారని ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలన్నదే వివేకా కోరిక అని చెప్పారు.
BJP: ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని
షర్మిలను చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ గుర్తుకొస్తారని.. వైఎస్సార్ గుణ గణాలు అన్ని షర్మిలలో ఉన్నాయని తన నాన్న పదే పదే చెబుతుండే వారని అన్నారు. షర్మిలను చూస్తుంటే వైఎస్సార్‌ని చూస్తున్నట్లే ఉంటుందని వివేకా అనుకున్నారని చెప్పారు. కొంతమంది వివేకా హత్య పర్సనల్ విషయమని మాట్లాడుతున్నారని.. ఇది పెద్ద విషయం కాదన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం, పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!
సలహాదారు అంటే ఎలా ఉండాలో ముందు అర్థం చేసుకోవాలని సూచించారు. జగన్ మాటలు సజ్జల చెబుతున్నారన్నారు. తన నాన్నను చంపితే తనకు పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డికి వివేకా హత్య గురించి ఎవరో ఫోన్ చేసి చెప్పారని ఆయన చెబుతున్నారని అన్నారు. అసలు ఈ హత్య వెనుకాలా ఉన్నది ఆయన కాదా అని ప్రశ్నించారు. అవినాష్ ఏమైనా పాలు తాగే పిల్లోడా? అని ఎద్దేవా చేశారు.
అక్కడ అంతా జరుగుతుంటే ఆయనకు ఆపే బాధ్యత లేదా ? అని నిలదీశారు. జగన్ ఎన్ని ఫేకులు చేసినా, పులివెందులలో ఓడిపోవటం ఖాయమని హెచ్చరించారు. బాబాయ్ హత్యకు, కడప జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పటం ఖాయమని వైఎస్ సునీతా రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు
AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్
YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్
మరిన్ని ఏపీ వార్తల కోసం...