Home » YuvaGalam
Lokesh Sankharavam: వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే‘శంఖారావం’. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ జరుగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపుదళం అంతా సిక్కోలు గడ్డపై వాలిపోయింది.
Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ‘యువగళం నవశకం’ విజయవంతంగా ముగిసింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరిగిన ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తోపాటు ఇరు పార్టీలకు చెందిన నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని.. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూశానంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. యువగళం నవశకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. 2014 నాటి సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత ఒకే ఉమ్మడి బహిరంగ వేదికను పంచుకున్నారు.
Andhrapradesh: జిల్లాలో టీడీపీ నవగళం బహిరంగ సభ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌ల కలయికతో రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు అన్నారు. నవగళం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోందన్నారు.
Andhrapradesh: యువగళం ముగింపు సభ ప్రాంగణం మహానాడును తలపిస్తోంది. యువగళం జైత్రయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం సభకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. నవశకం బహిరంగసభ ప్రాంగణం తెలుగుదేశం పార్టీ పెద్దపండుగ మహానాడు తలపిస్తోంది.
Andhrapradesh: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లలో అనూహ్య జాప్యం నెలకొంది.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఓకే వేధికపై కనిపించబోతున్నారు.