AP Elections 2024: గుర్తుపెట్టుకోండి.. ఎవర్నీ వదలను.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Apr 30 , 2024 | 09:09 PM
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఒంగోలు: వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ (
Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా తాగు, సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని మాటిచ్చారు. మొదటి 100 రోజుల్లో పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత కూటమిదని చెప్పారు.
Manifesto 2024: ఊహించని రీతిలో పెన్షన్ల పెంపు.. మేనిఫెస్టోలో కూటమి ప్రకటన
పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. జై అమరావతి ఇదే కూటమి నినాదమన్నారు. నాడు ఒక్క అవకాశం పేరుతో జగన్ మాయలో పడ్డారని..నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ తెచ్చిన పరిశ్రమలు వైసీపీ పాలనలో పక్క రాష్ట్రానికి తరలిపోయాయని అన్నారు. నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామన్నారు. ప్రజల తరఫున పోరాడినందుకు తనపై 23 కేసులు పెట్టారని చెప్పారు. ప్రజల తరఫున పోరాడితే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన తప్పులను ప్రజల ముందుంచామని లోకేశ్ తెలిపారు.
Read Latest AP News And Telugu News