Home » YuvaGalamPadayatra
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 202వ రోజుకు చేరుకుంది. శనివారం గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. మరికాసేపట్లో గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తికానుంది. అక్కడి నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఉంగుటూరులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముందుకుసాగుతోంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ.. ప్రజల ఆశీర్వాదాలతో నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యిక్షులు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
లింగపాలెం మండలం సుందరరావు పేట నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన పాదయాత్ర 197వ రోజుకి చేరుకుంది. అయితే విపరీతమైన షేక్ హ్యాండ్లు వలన భుజం నొప్పితో నారా లోకేష్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం రద్దు చేశారు. కాగా.. నారా లోకేష్‌కు లింగపాలెం గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడి విడిగా కేసులు నమోదు చేశారు.
బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నారా లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. బ్యానర్ పై వైసీపీ హయంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 190 వ రోజుకు చేరుకుంది. నిన్నటి నుంచి లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతోంది. ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో దాదాపు16 కిలోమీటర్ల మేర సాగనుంది.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాల ఆశ చూపించి ఓట్లు పొందాలని వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ పైఎత్తు వేశారు. నియోజకవర్గంలోని 20 వేల మంది పేదలకు అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని శనివారం స్పష్టమైన హామీ ఇచ్చారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు (YuvaGalam Padayatra) మొదటి రోజు నుంచి ఇవాళ్టి 183వ రోజు వరకూ ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆదరణను అధికార వైసీపీ (YSR Congress) జీర్ణించుకోలేకపోతోంది..
ప్రాజెక్టులపై టీడీపీ వ్యయం చేసిన దాంట్లో 20 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. జగన్ కమీషన్లు దండుకొని బిల్లులను మంజూరు చేశారు. చంద్రబాబు ప్రాజెక్టులపై రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టారు.