Nara Lokesh : అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20వేల సాయం అందిస్తాం | Nara Lokesh comments PVCH

Nara Lokesh : అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20వేల సాయం అందిస్తాం

ABN , First Publish Date - 2023-08-28T13:54:11+05:30 IST

లింగపాలెం మండలం సుందరరావు పేట నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన పాదయాత్ర 197వ రోజుకి చేరుకుంది. అయితే విపరీతమైన షేక్ హ్యాండ్లు వలన భుజం నొప్పితో నారా లోకేష్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం రద్దు చేశారు. కాగా.. నారా లోకేష్‌కు లింగపాలెం గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.

Nara Lokesh : అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20వేల సాయం అందిస్తాం

ఏలూరు : లింగపాలెం మండలం సుందరరావు పేట నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన పాదయాత్ర 197వ రోజుకి చేరుకుంది. అయితే విపరీతమైన షేక్ హ్యాండ్లు వలన భుజం నొప్పితో నారా లోకేష్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం రద్దు చేశారు. కాగా.. నారా లోకేష్‌కు లింగపాలెం గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో 30వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని..చింతలపూడి ఎత్తిపోతల పూర్తయితే మా పొలాలు సస్యశ్యామలమవుతాయని గ్రామస్తులు తెలిపారు. ఎత్తిపోతల భూ నిర్వాసితులకు నేటికీ డబ్బులు అందలేదన్నారు. గ్రామంలో రహదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని నారా లోకేష్‌కు వివరించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ నాలుగేళ్ల పాలనలో కనీసం పిల్లకాలువ కూడా పూర్తిచేయలేదన్నారు. రైతులకు అవరసరమైన ఏ సాగునీటి పథకమూ జగన్ పాలనలో పూర్తికాలేదన్నారు. రాష్ట్రప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచి నాశనం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. చింతలపూడి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం అందజేస్తామన్నారు. అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20వేల సాయం అందిస్తామన్నారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని నారా లోకేష్ తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-28T13:54:11+05:30 IST