Home » YV Subbareddy
AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.
సీఎం జగన్(CM Jagan)తో ఉంటేనే ఎవరికైనా రాజకీయ మనుగడ ఉంటుందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నారు.
Andhrapradesh: హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని... తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ విపక్షాల మధ్య విమర్శలు- ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు ధాటిగా విమర్శించేవారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేరిపోయారు.
Andhrapradesh: వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ.సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలని మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు.
విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్రాతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.
Andhrapradesh: కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందన్నారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌లో విలీన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Andhrapradesh: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా వైసీపికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబతాయన్నారు.
తాను వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి ( YV Subbareddy ) తెలిపారు. మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మని నెల రోజుల తర్వాత హైదరాబాద్‌లో కలిసేందుకు వెళ్లాను. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.