YV Subbareddy: టీటీడీ లడ్డుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా...వైవీ ఫైర్
ABN , Publish Date - Sep 19 , 2024 | 03:17 PM
Andhrapradesh: తిరుమల లడ్డు తయారీకి జంతువుల కొవ్వు వాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్న మాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్వామి వారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
అమరావతి, సెప్టెంబర్ 19: తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదాన్ని వైసీపీ హయాంలో అపవిత్రం చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YSRCP MP YV Subbareddy) స్పందించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు నీచాతి నీచంగా టీటీడీ లడ్డుపై మాట్లాడారని వ్యాఖ్యలు చేశారు.
KK Survey: కేకే సంచలన సర్వే.. ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..
గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనో భావాలు దెబ్బతిన్నాయన్నారు. జంతువుల కొవ్వు వాడుతున్నమని చంద్రబాబు అన్న మాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోందన్నారు. స్వామి వారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే..
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. స్వామి వారి ప్రసాదానికి వాడేది ప్రధానంగా ఆవు నెయ్యి అని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న విధానాన్నే కొన్ని మార్పులతో తాము కొనసాగించామని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ సమయంలో ఉన్న ఈఓ సింఘాల్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఉన్నారన్నారు. 60 కిలోల నెయ్యి స్వామి నైవేద్యానికి ప్రతిరోజూ కావలసి ఉంటుందన్నారు. స్వామి వారి నైవేద్యం కోసం వాడే పదార్ధాలు అన్నీ మార్కెట్‌లో కొంటే రసాయనాలు కలుస్తాయని తాము పండించామని చెప్పుకొచ్చారు. ఆర్గానిక్ ఘీ ద్వారా తాము నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసామని తెలిపారు. రాజస్థాన్‌లో ఉన్న గోశాల నుంచి తెచ్చి నెయ్యి వాడామన్నారు.
BRS: రైతుల పోరుబాటతో కాంగ్రెస్ వెన్నులో వణుకు.. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన హరీశ్
సుప్రీంకు వెళ్తాం..
రాజస్థాన్, గుజరాత్ నుంచి ఆవులను తీసుకు వచ్చి ఇక్కడ నెయ్యి తయారీ కేంద్రం సిద్ధం చేసామన్నారు. ప్రారంభానికి నెయ్యి తయారీ కేంద్రం సిద్ధమైందని తెలిపారు. టీటీడీకి సంబంధించి అన్ని నిర్ణయాలు బోర్డులో తీసుకున్నామన్నారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడారా లేక... కావాలని మాట్లాడారా అనే చర్చ జరుగుతోందన్నారు. ఏ విచారణకు అయినా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఇది భక్తుల మనో భావాలకు సంబంధించిన విషయమన్నారు. ఢిల్లీలో కూడా కూటమి ప్రభుత్వం ఉందని ఢిల్లీ విచారణకు కూడా సిద్ధమే అని అన్నారు. నెయ్యి నాణ్యత చెకింగ్ కోసం ల్యాబ్ ఉందన్నారు. 2019 నుంచి 2024లోపు క్వాలిటీ చెక్ చేసి నాణ్యత లేదని పదిసార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగిందన్నారు. ప్రజల దృష్టిలో తమ పార్టీని దుష్ప్రచారం చేయాలని ఇలా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఆధారాలు ఉంటే నిరూపణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణపై సుప్రీం కోర్టులో కేసు వేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....
Tirumala Laddu: తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడకం ఓ మాజీ అధికారి పుణ్యమే: ఓవీ రమణ
Read LatestAP NewsAndTelugu News