Home » Telangana » Karimnagar
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై అధికార కాంగ్రెస్పార్టీ దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులు కొద్ది నెలలుగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలో పనిగా తమకు మద్దతు ప్రకటించాలని పలువురిని కోరుతున్నారు.
జిల్లాలోని రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు ప ట్టాలు తప్పిన ప్రమాదనికి కారణాలేమిటనే విషయ మై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు ఓవర్ లోడ్ కారణమా, ట్రాక్ నిర్వహణ లోపమా అనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ఢిల్లీ, సికింద్రా బాద్, చెన్నై ప్రధానలైన్ కావడంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్, విద్యుత్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరు ద్ధరిస్తున్నారు.
తెలంగాణలోనే మోడల్గా నిలిచే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆధునిక హంగులతో నాలుగేళ్ల క్రితం నిర్మించిన రైతు బజార్ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో నిర్మించిన రైతు బజార్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావించినా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.
కార్మికుల హక్కుల సాధన యూనియన్ బలో పేతం కోసం ప్రతి ఒక్క నాయకుడు పని చే యాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సల హా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బీ జనక్ప్రసాద్ నాయకులకు సూచిం చారు.
నేషనల్ హైవేలో భూ ములు కోల్పోతున్న రైతులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.
గ్రూప్ 3 పరీక్షల ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభి వృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ పేర్కొ న్నారు.
చలికాలమైనా, ఎండ కాలమైనా ఫ్యాన్లు, ఏసీలు వేసుకోక తప్పని వాతావరణం... దిగువ మధ్య తరగతి కుటుంబమైనా.. అల్పాదాయ కుటుంబమైనా కూలర్, రిఫ్రిజిరేటర్, టీవీ సాధారణమైన రోజులు ఇవి.... నీరు తోడుకునేందుకు ప్రతి ఇంటికి మోటారు తప్పనిసరి. దీంతో రోజురోజుకు విద్యుత్ వినియోగం ఎక్కువైపోయి చార్జీల భారం తడిసిమోపెడవుతోంది.
జమ్మికుంట వ్వవసాయ మార్కెట్లో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జోరు పెంచింది. బుధవారం 1,200 క్వింటాళ్ల పత్తి కొన్నది. అక్టోబరు 23న స్థానిక మార్కెట్ యార్డులో జేడీఎం శ్రీనివాస్ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 20 రోజుల వ్యవధిలో 300 క్వింటాళ్లు పత్తి మాత్రమే సీసీఐ కొన్నది.
డీఈవో సీహెచ్వీఎస్ జనార్దన్రావు ను సస్పెండ్ చేసి, ఆయనపై రాష్ట్రస్థాయి అధికారితో విచారణ జరిపించాలని డీటీఎఫ్, టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.