Home » Telangana » Karimnagar
దళిత బంధు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ధర్నా, రాస్తారోకోకు పిలుపునిచ్చారు.
ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులతోపాటు కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించారు. ఈ సర్వేతో భావితరాలకు మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో భాగస్వాములై సమాచారమివ్వాలని, సర్వే ప్రామాణికంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించడంతో దేశ, విదేశాల్లో నుంచి స్వగ్రామాలకు చేరుకొని సమాచారమందించారు.
స్వయం స హాయక సంఘాల మహిళా సభ్యులకు బీమా సొమ్ము పై ఆశలు పెరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు బీమా సొమ్ము చెల్లింపునకు అధికారులు కసరత్తులు చేస్తుండ డంతో అర్హులైన మహిళలకు అందుతుందన్న ఆశతో ఎ దురుచూస్తున్నారు.
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కొనుగోలులో మాయాజాలం చోటుచేసుకున్నది. కొనుగోలు చేసిన భూ యజమాని పేరిట 44 లక్షల రూపాయలు డ్రా చేసిన పాలకవర్గం, ఆ యాజమానికి 37 లక్షలు మాత్రమే అందజేసి 7 లక్షల రూపాయలు కాజేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో పలువురు పాలకవర్గ సభ్యులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 3 వరకు ఇళ్ల జాబితాను సేకరించారు. 6 నుంచి 8వ తేదీ వరకు మరోసారి ఇళ్లను రివిజన్ చేసి కుటుంబాల లెక్కను పక్కాగా తేల్చారు. ఇంటింటికీ స్టిక్కర్ను అంటించారు. గుర్తించిన ఇళ్లలోని కుటుంబాల సర్వేను శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాఽధి, రాజకీయ, కులం వంటి వివరాలు నమోదు చేయనున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత వాతావరణంలో విద్య నేర్పుతారని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కుల వృత్తులను పెంపొందించే దిశగా మాజీ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
గోదావరిఖని కూరగాయల మార్కెట్లో కూలి రేట్లు పెంచా లని డిమాండ్ చేస్తూ శుక్రవారం హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ గౌస్ ఆధ్వర్యం లో ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాసటగా ఉంటుందని సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. నగర శివారులోని తీగలగుట్టపల్లిలో కaరీంనగర్ వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్న ఎన్టీపీసీ కొత్త ఆవిష్కర ణకు వేదిక అవుతున్నదని రామగుండం ప్రాజెక్టు, ఆర్ఈడీ(దక్షిణ) కేదార్ రంజన్పాండు అన్నారు.