Home » Telangana
గుర్తుతెలియని వ్యక్తులు ఓవ్యక్తిపై మారుణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని కుమ్మర్‌పల్లి చెరువు అలుగులో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నాలుగేళ్ల క్రితం బేగంపేట, బాచుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మృతి చెందారని, వారి కుటుంబాలకు పరిహారం అందించాలని ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం బాచుపల్లికి చెందిన మృతుడి తల్లి పి.అనిత ఆ గ్రామ మాజీ సర్పంచ్ యాలాల శ్రీనివా్‌సతో కలిసి మీర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి తనకు మంజూరైన డబ్బులు అకౌంట్లో పడలేదని మొరపెట్టుకున్నారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత సంబంధిత అఽధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్, కొండాపూర్. పూడూర్, కొడిమ్యాలలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ను అదనపు కలెక్టర్ పరిశీలించారు.
కుక్కలు బాబోయ్.. కుక్కలు అంటూ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లో గుంపులుగా సంచరిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు 29 గ్రామ పంచాయతీలలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపైనే పారవేస్తుండడంతో వాటిని తినడానికి షాపుల వద్ద కుక్కలు గుంపులుగా ఉంటున్నాయి.
జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లలో, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.
ఓ వ్యాపారిని ప్లాట్లు విక్రయిస్తామని పిలిపించి కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధి బొంగులూరు వద్ద చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు.. ఇబ్రహీంపట్నం టౌన్ బోయవాడ బస్తీలో నివాసముంటున్న రచ్చ నారాయణ వస్త్ర వ్యాపారంతో పాటు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలంం తుమ్మలపల్లిలో శనివారం సా యంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు..
బాలిక అదృశ్యమైన సంఘటన శనివారం ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎస్సై అర్షద్ కథనం మేరకు.. బిహార్‌కు చెందిన పశువాన్ వినోద్ బతుకు దెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి కొన్నేళ్ల క్రితం శంషాబాద్‌కు వలస వచ్చాడు. పట్టణంలోని అక్బర్ కాలనీలో భార్యపిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నారు. ఈనెల 18న వినోద్ తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతడి గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
దక్షిణ భారతదేశ రైల్వేకు ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేజంక్షన్ రూపురేఖలు మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసులు ఎదురుచూస్తున్న కోచ్ ఫ్యాక్టరీతో పాటు రైల్వే డివిజన్ ఏర్పాటుపై అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతుండగా, కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ హోదాతో రైల్వేమ్యాప్లో కాజీపేటకు ప్రత్యేక గుర్తింపు రానుంది.