Home » Telangana » Rangareddy
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు ఘట్కేసర్ సీఐ పరశురాం తెలిపారు.
అకాల వర్షాలతో దెబ్బతిని కాస్త దిగుబడి వచ్చిన పత్తి పంటకు కూలీల కొరత శాపంగా మారింది. కూలీల కొరత కారణంగా రైతులు పత్తి పంటను పొలాల్లోనే వదిలేసిన దుస్థితి నెలకొంది.
కష్టపడితే అసాధ్యం సుసాధ్యమేనని ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్ నందిని అగసారా అన్నారు. వికారాబాద్ అనంతగిరి పల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో గురువారం జరిగిన 10వ ఓనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు.
ప్రతీ మనిషికి పట్టెడన్నం పెట్టిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని, రైతులు దేశానికి వెన్నుముక లాంటివారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం శామీర్‌పేట రైతు సహకార సంఘం ప్రాంగణంలో చైర్మన్ మధుకర్‌రెడ్డితో కలసి ఈనెల 14 నుంచి 20వరకు నిర్వహించే 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు మేడ్చల్ పట్టణ జాతీయ రహదారి పక్కన పడి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. 28 నెలలుగా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, అశ్రద్ధ చేయకుండా అందరూ బాగా చదువుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం పట్టణంలోని సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించగా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలో మల్బరీ పంటల సాగు ప్రోత్సాహం కరువైంది. రానురాను పంట విస్తీర్ణం పడిపోతుంది. పంట దిగుబడి, లాభనష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో మల్బరీ సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.