Home » Telangana » Warangal
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి మహబుబాబాద్ వెళుతోంది. నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద చెరువు మత్తడి పొంగిపొర్లుతుంది. తోపనపల్లి చెరువు పొంగి ప్రవహించడంతో కట్టపై ఉన్న బస్సు వరద నీటిలో నిలిచిపోయింది.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏటూరునాగారం-వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.
‘అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి. ఆదివాసీలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తోంది. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వీటిని అందిపుచ్చుకొని ప్రజలు,ముఖ్యంగా ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. అలాగే విద్యతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్న విషయాన్ని అందూ గుర్తించాలి’ అని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పేర్కొన్నారు.
జిల్లాలో సుమారు 60 వేలకు పైగా గిరిజనులు ఉన్నారు. కాని వారి బాధలు చెప్పుకోవడానికి జిల్లాలో ఒక్క కార్యాలయం కూడా లేదు. వారికి ఏదైనా సమస్య వస్తే హనుమకొండకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడి 8 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి పలు గిరిజన, గిరిజన విద్యార్థి సంఘాలు ఎస్టీ కార్యాలయం కోసం డిమాండ్ చేస్తున్నా అధికారులు మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఇప్పటికైనా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు స్పందించి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని గిరిపుత్రులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మంచిర్యాల-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో సుమారు 25 కిలో మీటర్ల మేర ఈ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు 130.5 హెక్టార్ల భూమి
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.
సంప్రదాయ పంటలకు బదులు ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఆసక్తి ఉన్నవారికి సహకారం అందిస్తోంది. పలురకాలుగా రాయితీలను వర్తింపజేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ ఇంజనీర్లలో ఆందోళన నెలకొంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేప్టేందుకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో గుబులు మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ పట్టుకుంది.
Telangana: సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.