Home » Telangana » Warangal
పెద్ద దిక్కును కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం ఆసరా గా నిలుస్తోంది. కర్షకులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిం ది. కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన వారు, గతంలో బీమా పథకంలో ఉండి నామినీ చనిపోయిన వారు, ఆధార్కార్డులో తప్పులు ఉన్నవారు సరిదిద్దుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
రైతన్నల ఆలోచనల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కు తోంది. సాగులో అన్నదాతలు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా దొడ్డు రకం వరికి స్వస్తి పలికారు.. సన్నరకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సరదా కోసం అలవాటు చేసుకున్న ఆన్లైన్ గేమ్ కాస్తా ప్రాణాల మీదికి వస్తోంది. ఆట మోజులో పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మాయదారి జూదానికి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు యువకులు బలయ్యారు. మరికొందరు అప్పులపాలైతే తల్లిదం డ్రులు భూములు అమ్మి అప్పు తీర్చిన సంఘ టనలు ఉన్నా యి. సరదాగా రంగంలోకి దిగి.. సీరియస్గా మారి.. అనాలోచితంగా అప్పులు చేసి వాటిని ఎలా తీర్చాలో తెలియక.. ఎవరికీ చెప్పుకోలేక అందోళనతో బలవన్మరణానికి పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్న సంఘటనలు ఉన్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గత పది సంవత్సరాల పాలనలో ప్రజల్నే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులతోపాటు తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం దోచుకొని పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్: వరాలనిచ్చే చల్లనితల్లి.. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం.. ఆషాఢంలో ఆరంభపూజలు అందుకునే శక్తిస్వరూపిని.. భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళీ అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు.
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కాజీపేట మండలం మడికొండ వద్ద కలకోట్ల స్వప్న అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. బలంగా కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలంలోని గంగపురి-మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగులో రాత్రి బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాలీ డ్రైవర్ను సురక్షితంగా బయటకు చేర్చారు. అయితే బొలెరో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రెవె న్యూ, రిజిస్ర్టేషన్ శాఖలో కొంతమంది అధికారు లకు కాసులు కురిపిస్తున్నాయి. వ్యవసాయ భూము లను నివాస ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్ చే యాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నప్ప టికీ రెవెన్యూలో చేతులు తడపనిదే కన్వర్షన్ కావటం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. భారీ వెంచర్లు చేస్తే పన్నుల భారం పడుతుందని భావిస్తున్న రియల్టర్లు.. వ్యవసాయ భూములను ఫామ్ల్యాండ్గా గుంటల్లో విక్ర యిస్తున్నారు.
రైతు భరోసా (Rythu Bharosa) పథకం అమలుపై రేవంత్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.