Abn logo
Sep 14 2021 @ 21:22PM

61 ఏళ్ల బామ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల కుర్రాడు.. కారణమేంటని అడిగితే అతడి రెస్పాన్స్ ఇదీ..!

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఆశ్చర్యపోయారు.. మరికొందరు నెగెటివ్ కామెంట్స్‌ కుమ్మరించారు.. ఒకరో ఇద్దరో మినహా..అందరూ వారి బంధాన్ని వ్యతిరేకించిన వారే. కానీ ఆ జంట మాత్రం ఎవ్వరినీ లెక్కపెట్టలేదు. దేవుడిచ్చిన జీవితం ఒకటే.. ఇతరులకు నష్టం కలగనంత వరకూ ఎవరికి వారు తమకు నచ్చినట్టు స్వేచ్ఛగా జీవించవచ్చు..ఇదే వారి ఫిలాసఫీ..! అందుకే ఆ జంట పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. 

అసలు ఈ స్థాయిలో వారు వ్యతిరేకత ఎదుర్కోవడానికి కారణం.. వారి మధ్య ఉన్న వయసు తారతమ్యమే..! ఆమె వయసు 61 కాగా అతడి వయసు 24.  జీవితాన్ని కాచివడపోసిన అనుభవం ఆమెది.. పాతికేళ్లు కూడా దాటని చిరు ప్రాయం అతడిది. ఆ వృద్ధ వనిత పేరు షెరిల్ మెక్‌గ్రెగోర్..ఆ కుర్రాడి పేరు కొరాన్ మెక్‌కెయిన్. అమెరికాలో జరిగిన ఈ అసాధారణ పరిణయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 

ఇవీ చదవండి
బంగారం కొనడానికి వచ్చిన మహిళలు.. నచ్చలేదంటూ వెళ్లిన తర్వాత అనుమానం.. సీసీ కెమెరాను చెక్ చేస్తే..
మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. రాత్రి చిన్న గొడవ.. వేరు వేరుగా పడుకున్నారు.. తెల్లవారుజామున భర్త గదిలోకి వెళ్లి చూస్తే..

షెరిల్, కొరాన్‌లు జార్జియా రాష్ట్రంలో ఉంటారు. 2013లో వారికి తొలిసారిగా పరిచయమైంది. అప్పటికి అతడి వయసు జస్ట్ 15..!  షెరిల్ కుమారుడికి చెందిన షాపులో వారు ఒకరికొకరు తారసపడ్డారు. అది స్నేహానికి దారి తీసింది. కానీ..ఆ తరువాత వారు చాలా కాలం పాటు కలుకోనేలేదు. 2020 నవంబర్ 4న మరోసారి ఒకరికొకరు తారసపడ్డారు. వారి స్నేహం మరింత గాఢత సంతరించుకుంది. ఈ క్రమంలో కొరాన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో షెరిల్‌కు ప్రపోజ్ చేయడం.. ఆమె అతడి ప్రేమను అంగీకరించడం జరిగిపోయింది. సెప్టెంబర్ 3న వారు పెళ్లిచేసుకున్నారు. వారికి సన్నిహితులైన అతి కొద్దిమంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు..ఈ అసాధారణ జంట తమ వివాహ వేడుకను టిక్‌టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసింది. దీంతో.. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారి సన్నిహితులు కూడా వారి పెళ్లిని వీక్షించగలిగారు. షెరిల్‌కు ఏడుగురు పిల్లలైతే వారిలో ముగ్గరు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..కొరాన్‌కు ఇది తొలి వివాహం. 

మీకు షెరిల్ అంటే ఎందుకంత ఇష్టం అని కొరాన్‌ను అడగ్గా.. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని అతడు బదులిచ్చాడు. ‘‘షేరిల్ అందమైన మహిళే కాదు.. నిజాయితీపరురాలు, మానసికంగా ధృఢమైనది కూడా. అసలు..ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఈ విషయమై మేము..పాజిటివ్ కామెంట్స్‌తో పాటూ నెగెటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొన్నాం. కొందరేమో మరీ దారుణంగా.. నేను డబ్బు కోసమే షెరిల్‌ను పెళ్లి చేసుకుంటుంన్నట్టు భావించారు. మమల్ని ఎవరెంత ద్వేషించినా సరే..మేము మాత్రం అందరిలాగే సాధారణ జీవితాన్నే గడుపుతున్నాం’’ అని కొరాన్ స్పష్టం చేశాడు. 

ప్రత్యేకంమరిన్ని...