బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

ABN , First Publish Date - 2021-12-22T00:42:21+05:30 IST

హర్యానాలో ఓ కండక్టర్.. మహిళా ప్రయాణికులను టార్గెట్ చేశాడు. టికెట్లను ఆసరగా చేసుకుని, మహిళలను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించేవాడు. అయితే..

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

మహిళలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం.. వంటి కొటేషన్లను ఆర్టీసీ బస్సుల్లో చూస్తుంటాం. మహిళల సౌకర్యార్థం బస్సుల్లో వారికి కొన్ని సీట్లను పరిమితం చేయడం తెలిసిందే. ప్రయాణికుల విషయంలో డ్రైవర్లు, కండక్టర్లు గౌరవభావంతో ఉండాలి. కానీ హర్యానాలో మాత్రం ఓ కండక్టర్.. మహిళా ప్రయాణికులను టార్గెట్ చేశాడు. టికెట్లను ఆసరగా చేసుకుని, మహిళలను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించేవాడు. అయితే ఓ ప్రయాణికులు ఇచ్చిన ట్విస్ట్‌తో ఆ కండక్టర్‌కు గట్టి షాకే తగిలింది. వివరాల్లోకి వెళితే..


హర్యానా రోడ్‌వేస్ సంస్థ పరిధిలోని కల్నా సబ్ డిపోలో మహేంద్ర అనే వ్యక్తి కండక్టర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో బాధ్యతగా ఉండాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవాడు. మహిళా ప్రయాణికులను టార్గెట్ చేయడం మొదలెట్టాడు. అందంగా ఉండే ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే క్రమంలో వాటిపై తన ఫోన్ నంబర్‌ను రాసి ఇచ్చేవాడు. చాలా మంది మహిళలు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఏ సమస్యా తలెత్తలేదు. అయితే ఈ నెల 20వ తేదీన ఓ మహిళ మహేంద్ర ఉన్న బస్ ఎక్కింది.

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..


ఆమెను చూడగానే ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని ప్లాన్ వేశాడు. రోజూ మాదిరే ఆమెకు కూడా టికెట్‌పై తన నంబర్ రాసి ఇచ్చాడు. ఆమెకు మొదట అనుమానం కలగలేదు. అయితే బస్ దిగి వెళ్లాక టికెట్‌ను పడేసే క్రమంలో నంబర్‌ను గమనించింది. మొదట అవాక్కయిన ఆమె.. తర్వాత నేరుగా మహిళ కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన కమిషన్.. రవాణా శాఖకు లేఖ రాసింది. దీనిపై  హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రీతి భరద్వాజ్ దలాల్ మాట్లాడుతూ కండక్టర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

పొద్దున్నే 5గంటలకు భార్య బయటకు వెళ్లడం చూసిన భర్తకు డౌట్.. వెనుకే వెళ్తే బస్టాండ్‌లో ఆమె నిర్వాకం చూసి..

Updated Date - 2021-12-22T00:42:21+05:30 IST