సెల్ఫీలను అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసుకుంటే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2022-01-20T03:14:43+05:30 IST

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కొందరు ఇంట్లో కూర్చునే లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. విభిన్నమైన ఆలోచనలు ఉండాలే గానీ.. సంపాదనకు కొదవే ఉండదని ఎంతో మంది చేసి చూపిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాను..

సెల్ఫీలను అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసుకుంటే అవాక్కవుతారు..

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కొందరు ఇంట్లో కూర్చునే లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. విభిన్నమైన ఆలోచనలు ఉండాలే గానీ.. సంపాదనకు కొదవే ఉండదని ఎంతో మంది చేసి చూపిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జైలు పాలవుతుంటారు. ఇంకొందరు తమ తెలివి తేటలు ఉపయోగించి.. నిజాయితీగా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. ఇండోనేషియాకు చెందిన ఓ యువకుడు తన సెల్ఫీలను అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అదెలాగో చూద్దాం..


ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్‌ యూనివర్సిటీలో సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ అనే యువకుడు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సుల్తాన్ ఏడేళ్లుగా రోజూ ఒక సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇలా మొత్తం సుమారు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్‌లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ క్రమంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు. తన సెల్ఫీలను ఆన్‌లైన్‌లో ఎన్‌ఎఫ్‌టీలుగా విక్రయించాలని ప్రయత్నించాడు. ఒక సెల్ఫీ మూడు డాలర్లు(రూ.223)గా రేటు పెట్టాడు.

మీ ఇంటి కిటికీ కూడా ఇలాగే ఉందా.. అయితే ఇల్లు గుళ్లవడం ఖాయం.. వైరల్ అవుతున్న వీడియో


అయితే అనుకోని విధంగా తన సెల్ఫీలకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు క్రిప్టో కరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్‌తో ఒక్కో సెల్ఫీ రూ.60 వేలు పలికింది. దీనికితోడు ఓ ప్రముఖ సెలబ్రిటీ చెఫ్‌.. తన సోషల్ మీడియా ఖాతాలో సుల్తాన్ సెల్ఫీలను ప్రమోట్ చేశాడు. దీంతో సెల్ఫీ విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. సుల్తాన్ సుమారు రూ.7 కోట్లు పైనే సంపాదించాడు. సెల్ఫీలతో కోట్లు సంపాదించిన యువకుడు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాడు.

పారాగ్లైడింగ్‌కు వెళ్లిన దంపతులు.. ఆకాశంలో భార్య వింత ప్రవర్తన.. నవ్వులు పూయిస్తున్న వీడియో

Updated Date - 2022-01-20T03:14:43+05:30 IST