షాపులో కౌంటర్‌పైకి సడన్‌గా దూకిన ఆరు అడుగుల పాము.. ఆ కుర్రాడి వెన్నులో వణుకు..

ABN , First Publish Date - 2021-09-10T18:19:24+05:30 IST

షాపులోపలికి వెళ్లేందుకు కుర్రాడు కౌంటర్ ఎక్కాడు.. అనుకోకుండా పైకి చూశాడు.. ఓ ఎలుకను తరుముకుంటూ వస్తున్న ఆరడుగుల పాము కనిపించింది..

షాపులో కౌంటర్‌పైకి సడన్‌గా దూకిన ఆరు అడుగుల పాము.. ఆ కుర్రాడి వెన్నులో వణుకు..

షాపు లోపలికి వెళ్లేందుకు కుర్రాడు కౌంటర్ ఎక్కాడు.. అనుకోకుండా పైకి చూశాడు.. ఓ ఎలుకను తరుముకుంటూ వస్తున్న ఆరడుగుల పాము కనిపించింది.. దీంతో ఒక్క ఉదుటున ఆ కుర్రాడు బయటకు దూకేశాడు.. సరిగ్గా ఆ కౌంటర్ పైనే పాము పడింది.. ఎలుకను తరముకుంటూ వెళ్లిపోయింది.. ఆ పామును చూసిన కుర్రాడు చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


రైసీన్ ప్రాంతంలో కపిల్ వర్మ అనే యువకుడు పాన్ షాప్ నడుపుతున్నాడు. గురువారం సాయంత్రం షాప్ తలుపు తీసి లోపలికి వెళ్లేందుకు కపిల్ కౌంటర్ ఎక్కాడు. సరిగ్గా అదే సమయంలో సౌండ్ వస్తే పైకి చూశాడు. ఓ ఎలుకను తరముకుంటూ వస్తున్న భారీ విషసర్పం కనిపించింది. దీంతో కపిల్ వెంటనే బయటకు దూకేశాడు. 


ఇవి కూడా చదవండి

అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తికి వెరైటీ ట్రిక్‌తో బుద్ధి చెప్పిన యువతి.. దెబ్బకు హడలిపోయిన నెటిజన్..





పెళ్లికి ముందే కాబోయే భర్తతో శారీరకంగా కలిసిన యువతి.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మృతి.. అసలేం జరిగిందంటే..


సరిగ్గా అతడు కూర్చున్న కౌంటర్ మీదకే పాము కూడా దూకి ఎలుక వెనుక పడింది. అనంతరం మళ్లీ షాపు సీలింగ్ పైకి వెళ్లి వెనక్కి వెళ్లిపోయింది. ఆ పామును చూసిన కపిల్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. చాలా గంటల వరకు తేరుకోలేకపోయాడు. చుట్టుపక్కల వారు అతడికి మంచినీళ్లు తాగించి ధైర్యం చెప్పాక కాస్తా కుదుటపడ్డాడు. ఆ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. 

Updated Date - 2021-09-10T18:19:24+05:30 IST