Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒంటెలకు కూడా అందాల పోటీలా..? అని అవాక్కవుతున్నారా..? ఆ పోటీల్లో గెలిచేందుకు యజమానులు చేసే నిర్వాకాలేంటో తెలిస్తే..

స్త్రీ, పురుషులకు అందాల పోటీలు ఉన్నట్లే.. జంతువులకు కూడా అందాల పోటీలు ఉంటాయి. ఏంటీ అవాక్కవుతున్నారా.. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. చాలా ఏళ్లుగా అక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోందట. ఆ పోటీల్లో ఎలాగైనా గెలవడానికి ఒంటెల యజమానులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు చిన్నపిల్లలను ముస్తాబు చేసినట్లు.. ఒంటెలను చూడముచ్చటగా అలంకరిస్తుంటారు. ఈ పోటీలను ఒంటెల యజమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గెలిచిన వారి ఆనందానికి హద్దులు ఉండవు. ఆ వివరాల్లోకి వెళితే..

సౌదీ అరేబియా రియాద్‌లో ఈ సాంప్రదాయాన్ని చాలా కాలం నుంచి కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. ఎక్కడెక్కడి నుంచే యజమానులు తమ ఒంటెలను తీసుకొచ్చి పోటీల్లో పాల్గొంటారు. ఒంటెల పెదాలు, తల ఆకారం, దుస్తులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకునే జ్యూరీ సభ్యులు అంతిమంగా విజేతను ప్రకటిస్తారు. గెలుపొందిన ఒంటె యజమానికి 66మిలియన్ డాలర్లు(రూ.5,00,30,97,000.00) ప్రైజ్ మనీని బహుమతిగా అందజేస్తారు. దీంతో ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ఒంటెల యజమానులు క్యూకడుతుంటారు. పోటీల్లో ఎలాగైనా గెలుపొంది.. ప్రైజ్ మనీని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒంటెల యజమానులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

విమానం పైలెట్‌కు కనిపించిన షాకింగ్ దృశ్యం.. సముద్రంలో ఇదేం విచిత్రం.. ఏలియన్సేనా..?

ఒంటెలను అందంగా తీర్చిదిద్దడం కోసం కొందరు సహజ సిద్ధమైన పద్ధతులను అవలంభిస్తుంటారు. పెదాలకు లిప్‌స్టిక్ పూయడం, రంగురంగుల దుస్తులు వేయడం, పెదవులు పెద్దవిగా కనిపించేలా రబ్బరు బ్యాండ్లు కట్టడం వంటివి చేస్తుంటారు. మరికొందరైతే బొటాక్స్ ఇంజెక్షన్లు వేయడం, కాస్మొటిక్ సర్జరీలు చేయించడం వంటివి చేస్తుంటారు. అయితే ఇటీవల ఇలాంటి చర్యలను నిర్వాహకులు నిషేధించారు. సహజసిద్ధంగా అలంకరించిన ఒంటెలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. కాస్మొటిక్ సర్జరీలు చేయించడంతో ఈ ఏడాది పోటీలకు వచ్చిన దాదాపు 40ఒంటెలను నిషేధించారు. ఒంటెలకు ఎలాంటి ఇంజెక్షన్లు, సర్జరీలు చేసినా గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు తెలిపారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement