భర్తతో గొడవపడ్డ భార్య.. ఆ కోపమంతా కూతురిపై చూపించి.. చివరికి ఆమె చేసిన పనేంటో తెలుసా..
ABN , First Publish Date - 2021-12-19T02:34:18+05:30 IST
సర్దుకుపోవాల్సిన భార్య.. భర్తపై కోపం పెంచుకుంది. కానీ అతన్ని ఏమీ అనలేక.. చివరకు ఆ కోపాన్నంతా కూతురిపై చూపించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సంసారంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరోఒకరు సర్దుకుపోతే అంతటితోనే పోతుంది. లేదంటే చిన్న సమస్యలైనా చిలికి చిలికి గాలివానగా మారి.. చివరకు పెను దుమారాన్ని రేపుతాయి. ఈ విషయం తెలీక చాలామంది గోటితో పోయేదాన్ని.. గొడ్డలి వరకూ తెచ్చుకుంటూ ఉంటారు. మైసూర్లో ఇలాగే జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న చిన్న వివాదాలు, చివరకు చాలా వరకు వెళ్లాయి. సర్దుకుపోవాల్సిన భార్య.. భర్తపై కోపం పెంచుకుంది. కానీ అతన్ని ఏమీ అనలేక.. చివరకు ఆ కోపాన్నంతా కూతురిపై చూపించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని గట్టివాడి గ్రామంలో మహాదేవ ప్రసాద్, అన్నపూర్ణ (22) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమవగా.. ప్రస్తుతం ఓ పాప ఉంది. అయితే చాలా రోజులుగా భార్యభర్తలు వివిధ కారణాలతో గొడవలు పడుతుండేవారు. మొదట్లో ఎవరో ఒకరు సర్దుకుపోవడంతో సమస్య పెద్దది కాలేదు. కానీ ఇటీవల మాత్రం ఇద్దరూ రోజూ గొడవలు పడడం మొదలెట్టారు. భర్త మాట భార్య వినకపోవడం, భార్య మాట భర్త వినకపోవడంతో చిన్న చిన్న సమస్యలకూ గొడవలు జరిగేవి. అందులోనూ వారికి చెప్పేవారు కూడా లేకపోవడంతో గొడవలు రోజురోజుకూ పెద్దవి అవుతుండేవి.
బాత్రూమ్లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..
ఈ క్రమంలో శుక్రవారం భార్యభర్తలు మళ్లీ గొడవ పడ్డారు. భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త.. కాసేపటికి బయటికి వెళ్లిపోయాడు. అయితే అన్నపూర్ణ మాత్రం భర్తపై కోపంతోనే ఉంది. కానీ భర్తను ఏమీ అనలేక.. ఆ కోపాన్నంతా కూతురిపై చూపించింది. కుమార్తెను ఓ నీళ్ల బకెట్లో ముంచింది. దీంతో అభం శుభం తెలీని ఆ చిన్నారి, కాసేపటికి ఊపిరాడక మృతి చెందింది. అప్పటికే తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆమె.. కూతురు మరణంతో మరింత ఆందోళన చెందింది. తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త బోరున విలపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.