Viral Video: పాముతోనే నీరు తాగించాడు.. ఇతను మామూలు వ్యక్తి కాదు.. చూస్తే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2022-01-17T03:22:29+05:30 IST

వ్యక్తి అరచేతిలో నీటిని పట్టుకురాగా.. ఆకుపచ్చ రంగులో ఉండే ఓ పాము అతడి చేతి మీదకు పాకుతూ వస్తుంది. పశువులు నీరు తాగినట్లుగా తాగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది...

Viral Video: పాముతోనే నీరు తాగించాడు.. ఇతను మామూలు వ్యక్తి కాదు.. చూస్తే అవాక్కవుతారు..

పాము ఏంటీ.. నీళ్లు తాగడమేంటీ.. అందులోనూ మనిషి నీళ్లు తాగించడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా.. వీడియో చూస్తే మీరే అవాక్కవుతారు. సోషల్ మీడియాలో ఇటీవల విభిన్నమైన వీడియోలు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటువంటిదే ఈ స్నేక్ వీడియో కూడా! అసలు ఎవరైనా పామును చూస్తేనే ఆమడ దూరం పరుగెడతారు. అలాంటిది ఒంటి మీద పాకితే ఇంకెలా వుంటుందో ఊహించుకోవచ్చు. ఈ వీడియోలో ఓ పాము ఏకంగా ఒక వ్యక్తి చేతి మీదకు పాక్కుంటూ వస్తుంది. అతడి అరచేతిలోని నీటిని కూడా తాగడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 


Susanta Nanda IFS అనే ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. అందులో ఓ వ్యక్తి అరచేతిలో నీటిని పట్టుకురాగా.. ఆకుపచ్చ రంగులో ఉండే ఓ పాము అతడి చేతి మీదకు పాకుతూ వస్తుంది. పశువులు నీరు తాగినట్లుగా తాగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతడికి ఏమాత్రం హానిచేయకపోవడంతో.. ఇది పెంచుకున్న పామేమో అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సైలెంట్‌గా నీరు తాగుతుందిగా.. అని పాములను నమ్మొద్దు బ్రదర్ అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

ఈ హంస నిజంగా గ్రేట్.. దీన్ని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. కావాలంటే మీరే చూడండి..



Updated Date - 2022-01-17T03:22:29+05:30 IST