Viral Video: ఈ హంస నిజంగా గ్రేట్.. దీన్ని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. కావాలంటే మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-01-16T23:30:53+05:30 IST

పాలను, నీళ్లను హంస వేరు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం చూడబోయే హంసకు మరిన్ని మంచి గుణాలు ఉన్నట్టున్నాయి. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేసే మనిషి.. ఈ హంసను చూసి..

Viral Video: ఈ హంస నిజంగా గ్రేట్.. దీన్ని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. కావాలంటే మీరే చూడండి..

ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నెరవేరిస్తే.. ఏ సమస్యలూ ఉండవు. అయితే ప్రస్తుత సమాజంలో మనుషులు తమ బాధ్యతలు మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తునే ఉన్నాం. తద్వారా తాము సమస్యల్లో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెడుతుంటారు. అందుకే మనుషుల కంటే జంతువులు, పక్షులే నయమని పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హంస వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.


పాలను, నీళ్లను హంస వేరు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం చూడబోయే హంసకు మరిన్ని మంచి గుణాలు ఉన్నట్టున్నాయి. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేసే మనిషి.. ఈ హంసను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓ సరస్సులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని హంస పక్కకు తీసేయడాన్ని వీడియోలో చూడొచ్చు. తన పిల్లల ప్రాణాలకు హాని కలగకుండా ఉండడంతో పాటూ స్వేచ్ఛగా ఈదేందుకు సరస్సును శుభ్రం చేయడం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కాస్త పిజ్జా ఇచ్చి పుణ్యం కట్టుకోండయ్యా.. అంటూ యజమానికి పిల్లి వేడుకోలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘తన పిల్లల కోసం నీటి నుంచి హంస ప్లాస్టిక్ తొలగిస్తోంది. మరి మనకెప్పుడు అర్థమవుతుంది’.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘‘ఈ హంస చాలా తెలివైనదంటూ’’ కొందరు.. ‘‘జంతువులు, పక్షులను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

సింహాలతో సరదా సరదాగా మహిళ వాకింగ్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..



Updated Date - 2022-01-16T23:30:53+05:30 IST