Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూతురు బతుకుతుందని 2నెలలుగా ఎదురుచూపులు.. ఆ తల్లిదండ్రులు రోజూ చేసే పని చూసి..

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైతే.. వారినే తలుచుకుంటూ కొందరు కుమిలిపోతుంటారు. వారు లేరన్న నిజాన్ని జీర్ణించుకునేందుకు చాలా సమయం పట్టొచ్చు. కొందరైతే తమ పిల్లలపై అమితమైన ప్రేమను పెంచుకుంటారు. అనూహ్యంగా పిల్లలు దూరమైతే.. వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. ఇండోనేషియాలో ఓ కుటుంబానికి ఇలాగే జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనుకోని విధంగా మృతి చెందింది. దీంతో తమ కూతురు ఎలాగైనా బతుకుతుందని, ఆ కుటుంబం రెండు నెలల పాటు చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. 

ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలోని పల్కరన్ గ్రామంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి 14ఏళ్ల కుమార్తె ఉంది. ఇటీవల ఆమె టీబీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. కుమార్తెను కాపాడుకునేందుకు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకపోయింది. ఊహించని ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురయ్యారు. తమ కుమార్తె ఎప్పటికైనా బతుకుతుందనే నమ్మకంతో అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. చుట్టుపక్కల వారికి చెప్పకుండా మృతదేహాన్ని ఇంట్లోనే దాచారు.

ఆడ వేషం ధరించి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు వల.. నమ్మకం ఏర్పడగానే ప్రేమ నాటకం.. అశ్లీల ఫొటోలతో..

కూతురు బతికొస్తుందని రోజూ పూజలు చేస్తూ ఉండేవారు. కొన్నాళ్లకు మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చేది. రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంచటంతో శవం పూర్తిగా కుళ్లిపోయింది. దుర్వాసన ఎక్కువగా వస్తుండడంతో చుట్టుపక్కల వారు వారి ఇంట్లోకి వెళ్లారు. కుళ్లిన మృతదేహానికి పూజలు చేయడం చూసి షాక్ అయ్యారు. గ్రామ పెద్దలు కలుగజేసుకుని.. వారికి నచ్చజెప్పారు. ఎట్టకేలకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో సమస్య సద్దుమణిగింది.

అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. దోచుకున్న అనంతరం వంట గదిలో చేసిన చిన్న పనితో.. చివరకు

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement