సరదాగా ఈత కొడుతున్న వ్యక్తి.. ఇంతలో అటుగా దూసుకొచ్చిన భారీ సొరచేప.. చివరికి..

ABN , First Publish Date - 2022-02-18T02:47:23+05:30 IST

సొరచేపలు మనుషుల మీద దాడి చేయడం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో..

సరదాగా ఈత కొడుతున్న వ్యక్తి.. ఇంతలో అటుగా దూసుకొచ్చిన భారీ సొరచేప.. చివరికి..

సొరచేపలు మనుషుల మీద దాడి చేయడం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో దారుణం జరిగింది. బీచ్‌లో చాలా మంది సరదాగా ఈత కొడుతున్నారు. ఓ స్విమ్మర్ వారికి దూరంగా ఈత కొడుతున్నాడు. ఇంతలో అటువైపు ఓ భారీ సొరచేప దూసుకొచ్చింది. సడన్‌గా దాన్ని చూడగానే అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.


ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 1963 తర్వాత సిడ్నీలో ఇదే తొలి షార్క్‌ దాడి అని తెలిసింది. స్థానికంగా ఉన్న ఓ బీచ్‌లో బుధవారం సాయంత్రం పర్యాటకులంతా ఈత కొడుతూ ఉన్నారు. ఓ వ్యక్తి వారికి దూరంగా ఈదుతున్నాడు. ఇంతలో అక్కడికి ఓ భారీ సొరచేప వస్తుంది. దాన్ని చూసి అంతా బయటికి పరుగులు తీస్తారు. ఒంటరిగా ఈత కొడుతోన్న వ్యక్తి మీద సొరచేప ఒక్కసారిగా దాడి చేస్తుంది. దీంతో తప్పించుకోవడానికి కూడా అతడికి సమయం చిక్కదు. ఆ వ్యక్తిని నోట కరుచుకున్న సొరచేప సముద్రంలోకి లాక్కెళ్లింది.

ఈ నక్కకు సంగీతం తెగ నచ్చినట్లుందే.. బుద్ధిగా వింటూ ఎలా పరవశిస్తోందో చూడండి..


ఈ ఘటనను మొత్తం ఒడ్డున ఉన్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఉన్న బీచ్‌లు అన్నింటినీ మూయించారు. పోలీసులు సముద్రం ఒడ్డున మృతుడి అవశేషాలను గుర్తించారు. బీచ్‌లలో పెట్రోలింగ్ సిబ్బంది వైఫల్యం వల్లే ఇలా జరిగిందని తెలిసింది. మరో ఘటనలో వారం క్రితం పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎస్పెరెన్స్‌లోని కెల్ప్ బెడ్స్ బీచ్‌లో జాక్వెలిన్ అనే యువతి సొరచేప దాడి నుంచి అదృష్టవశాత్తు తప్పించుకుందని అధికారులు తెలిపారు.

రైలు పట్టాలపై బైక్‌పై వ్యక్తి.. ఎదురుగా దూసుకొస్తున్న ట్రైన్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..





Updated Date - 2022-02-18T02:47:23+05:30 IST