Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమెకు డబ్బులు అవసరం! అతడేమో ఇంటికొస్తే అప్పు ఇస్తానన్నాడు.. సరేనని వెళ్లిన ఆ మహిళకు..

ఇంటర్నెట్ డెస్క్:  ఆమె ఓ టీచర్. డబ్బులు అవసరం పడటంతో ఓ వ్యక్తిని సాయం చేయమని కోరింది. అతడేమో తనను తాను ఏసీపీగా పరిచయం చేసుకున్నాడు. సాయం చేసేందుకు అంగీకరించాడు. తన ఇంటికొచ్చి డబ్బులు పట్టికెళ్లమన్నాడు. ఆమె సరేనంది. ఆమె అక్కడికి వెళ్లాక అతడు ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను బలాత్కరించి..ఆపై ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు రెండు బ్లాంక్ చెక్కులపై సంతకాలు తీసుకుని వెళ్లిపోయాడు. పూణెకు సమీపంలోని పింప్రీచించివాడ్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఈ దారుణం జరిగింది.

తన నగ్న ఫొటోలు చూపిస్తూ అతడు బ్లాక్ మెయిల్‌కు దిగడంతో భరించలేకపోయిన ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇంటికి పిలిచి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా.. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఆమె పనిచేస్తున్న స్కూల్‌కు వెళ్లిన నిందితుడు ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడట. విషయం ఎవరికైనా చెబితే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించాడు.

ఇవీ చదవండి
పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. విడాకుల కేసుల చరిత్రలోనే అనూహ్య పరిణామం..!
ఓ భర్తకు వింత కష్టం.. ప్లకార్డుపై భార్య ఫొటోతో.. 4 రోడ్ల కూడలిలో నిలబడి దీనంగా.. అసలు కథేంటంటే..

‘‘నేను ఏసీపీని. నన్నెవరూ ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను, నీ కుటుంబాన్నీ బతకనీయను’’ అంటూ వికాస్ అవస్థీ తనను బెదిరించినట్టు ఆమె పేర్కొంది. ఆ నగ్న వీడియోను అడ్డం పెట్టుకుని ఆ తరువాత కూడా పలుమార్లు తనను నిందితుడు బలాత్కరించాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో...పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వికాస్ పోలీసు ఉన్నతాధికారి కాదని.. పోలీసు శాఖతో అతడికి ఏ సంబంధం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement