నీ భార్య ఉరి వేసుకుందంటూ ఇంటి యజమాని ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండి.. నేనొచ్చేస్తానన్న భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-02-25T01:15:07+05:30 IST

కొందరు మహిళలు మాయమాటలు నమ్మి తమ జీవితాలనే నాశనం చేసుకుంటూ ఉంటారు కూడా. జైపూర్‌‌లో ఇలాగే జరిగింది. ‘‘నీ భార్య ఉరి వేసుకుంది’’ అంటూ ఇంటి యజమాని ఫోన్ చేశాడు. ‘‘ఆస్పత్రికి తీసుకెళ్లండి.. ఈలోపు నేను వస్తా’’ అంటూ భర్త సమాధానం ఇచ్చాడు...

నీ భార్య ఉరి వేసుకుందంటూ ఇంటి యజమాని ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండి.. నేనొచ్చేస్తానన్న భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

నేటి ఆధునిక ప్రపంచంలో అక్కడక్కడా కొన్ని సందర్భాల్లో వివాహ బంధాన్ని కొందరు అపహాస్యం చేస్తుంటారు. క్షణకాల సుఖం కోసం ప్రేమ, పెళ్లి వంటి బంధాలకి చెడ్డపేరు తెస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మహిళలు మాయమాటలు నమ్మి తమ జీవితాలనే నాశనం చేసుకుంటూ ఉంటారు కూడా. జైపూర్‌‌లో ఇలాగే జరిగింది. ‘‘నీ భార్య ఉరి వేసుకుంది’’ అంటూ ఇంటి యజమాని ఫోన్ చేశాడు. ‘‘ఆస్పత్రికి తీసుకెళ్లండి.. ఈలోపు నేను వస్తా’’ అంటూ భర్త సమాధానం ఇచ్చాడు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ జైపూర్‌లోని దౌసా ప్రాంతానికి చెందిన విక్రమ్‌కు, యూపీలోని హర్దోయి ప్రాంతానికి చెందిన రోష్ని(28)తో చండీగఢ్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి చేసుకోకుండానే భార్యభర్తలమంటూ గది అద్దెకు తీసుకుని ఉండేవారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం జైపూర్ వచ్చి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదుగానీ బుధవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విపరీత ఆగ్రహానికి గురైన విక్రమ్.. తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరికి వేలాడదీసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇదే నా అడ్రస్.. మీకు చేతనైతే పట్టుకోండి.. రూ.22 కోట్ల విలువైన కార్లను చోరీ చేసి.. పోలీసులకే ఓ దొంగ సవాల్


రోష్ని మృతదేహాన్ని చూసిన ఇంటి యజమాని.. విక్రమ్‌కు ఫోన్ చేశాడు. ‘‘మీ భార్య ఉరి వేసుకుని చనిపోయింది’’.. అంటూ సమాచారం అందించాడు. దీంతో ఫోన్లో ఏడ్చినట్లు నటించాడు. ‘‘నా భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లండి.. ఇంతలో నేనొస్తా’’ అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు. తర్వాత ఫోన్ చేసినా అందుబాటులో లేడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ నంబర్ ఆదారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

చావు అంచులదాకా వెళ్లిరావడం అంటే ఇదేనేమో.. అదృష్టం బాగుండి సరిపోయింది.. లేదంటేనా

Updated Date - 2022-02-25T01:15:07+05:30 IST