ఇది ఇంట్రవెల్ మాత్రమే.. సినిమా ఇంకా పూర్తికాలేదు.. : Minister Peddireddy

ABN , First Publish Date - 2021-11-22T18:49:38+05:30 IST

మూడు రాజధానుల బిల్లులను జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన...

ఇది ఇంట్రవెల్ మాత్రమే.. సినిమా ఇంకా పూర్తికాలేదు.. : Minister Peddireddy

అమరాతి : మూడు రాజధానుల బిల్లులను జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఏపీలో పరిణామాలు మారిపోయాయి. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ ముగియగా.. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటనే చేయనున్నారు. అయితే ఆ ప్రకటన ఏంటో అని తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చేసేస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

‘ రాజధాని విషయంలో ఇది ఇంట్రవెల్ మాత్రమే.. సినిమా ఇంకా పూర్తికాలేదు. రాజధాని రైతులు, టీడీపీ వేరు కాదు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రను టీడీపీనే చేయిస్తోంది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను కేబినెట్‌ భేటీలో పాల్గొనలేదు. కాబట్టి పూర్తి వివరాలు తెలియవు. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమి కాదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’ అని పెద్దిరెడ్డి కామెంట్స్ చేశారు. కాగా.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా స్పందిస్తుంటే.. టీడీపీ నేతలు, అమరావతి జేఏసీ నేతలు మాత్రం ఇదంతా తమ విజయమే.. ప్రభుత్వం ఇక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-11-22T18:49:38+05:30 IST