Viral Video: రైలు పట్టాలు దాటుతోన్న 20 ఏళ్ల యువతి.. హఠాత్తుగా కదిలిన గూడ్సు రైలు.. ఓ వ్యక్తి చేసిన రిస్క్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-02-12T22:21:07+05:30 IST

భోపాల్‌లోని రైల్వే స్టేషన్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. రద్దీగా ఉన్న ఓ స్టేషన్‌లో ప్రయాణికులంతా పట్టాలపై అటూ, ఇటూ తిరుగుతున్నారు. వారితో పాటూ 20 ఏళ్ల యువతి కూడా పట్టాలు దాటుతోంది. అదే సమయంలో అక్కడే ఉన్న..

Viral Video: రైలు పట్టాలు దాటుతోన్న 20 ఏళ్ల యువతి.. హఠాత్తుగా కదిలిన గూడ్సు రైలు.. ఓ వ్యక్తి చేసిన రిస్క్ ఇదీ..!

పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కొందరు ఎలాంటి గాయాలూ కాకుండా బయటపడుతుంటారు. అలాంటి సమయంలో వీరికి భూమి మీద నూకలు మిగిలున్నాయి రా.. అని అంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా.. ప్రాణాల మీదకు వస్తూ ఉంటుంది. భోపాల్‌లోని రైల్వే స్టేషన్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. రద్దీగా ఉన్న ఓ స్టేషన్‌లో ప్రయాణికులంతా పట్టాలపై అటూ, ఇటూ తిరుగుతున్నారు. వారితో పాటూ 20 ఏళ్ల యువతి కూడా పట్టాలు దాటుతోంది. అదే సమయంలో అక్కడే ఉన్న గూడ్సు రైలు సడన్‌గా కదిలింది. తర్వాత ఏం జరిగిందంటే..


భోపాల్‌లోని బర్ఖేడి రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 5న ఈ ఘటన జరిగింది. వచ్చీపోయే ప్రయాణికులతో స్టేషన్ మొత్తం రద్దీగా ఉంది. కొందరు పట్టాలపై అటూ, ఇటూ దాటుతున్నారు. వారితో పాటూ ఓ 20 ఏళ్ల యువతి కూడా పట్టాలు దాటుతోంది. తీరా యువతి పట్టాలు దాటే క్రమంలో.. అక్కడే ఉన్న గూడ్సు రైలు ఒక్కసారిగా కదిలింది. ఊహించని పరిణామంతో షాకైన యువతి భయంతో కేకలు పెట్టింది. పక్కన ఉన్న వారంతా కంగారుగా చూస్తున్నారే గానీ సాయం చేసేందుకు ఎవరూ సాహసించలేదు. ఇంతలో అక్కడే ఉన్న మెహబూబ్ అనే వ్యక్తి.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పట్టాల మీదకు దూకేశాడు. యువతిని రక్షిద్దామనుకునే సమయంలోనే రైలు సమీపానికి వచ్చింది.

 తల్లి ప్రేమను అర్థం చేసుకోమంటూ.. కొడుక్కి ఈ కుక్క ఎంత బాగా చెప్పింది... మీరే చూడండి..


తీరా వారిని రైలు ఢీకొనే సమయంలో మెహబూబ్.. సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. వెంటనే యువతిని పట్టాలపై పడుకోబెట్టాడు. అలాగే తాను కూడా పట్టాలపై బోర్లా పడుకున్నాడు. రైలు వారి మీదుగా వెళ్లిపోతోంది. ప్లాట్‌‌ఫాంపై ఉన్న వారంతా కంగారుగా చూస్తూ ఉన్నారు. రైలు కింద ఉన్న వారికి ఏమైందో అనుకుంటూ అంతా ఊపిరి బిగపట్టుకుని గమనిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు వారికి ఎలాంటి గాయాలూ కాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. యువతి ప్రాణాలు కాపాడిన మెహబూబ్‌ను శుక్రవారం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడైన షోయబ్ హష్మీ అనే వ్యక్తి సన్మానించారు. బీహార్ బ్యాంక్ కాలనీలో ఉంటున్న మెహబూబ్.. ఫర్నీచర్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. మెహబూబ్ మాట్లాడుతూ తాను 30సెకన్లు ఆలస్యం చేసి ఉన్నా.. పెద్ద ప్రమాదం జరిగుండేదని చెప్పాడు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా యువతిని కాపాడిన మెహబూబ్‌ను ప్రజలంతా ప్రశంసలతో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

భార్య, నలుగురు పిల్లలతో పెళ్లికి వెళ్లి కారులో తిరిగొస్తున్న భర్త.. అర్ధరాత్రి 12 గంటలకు అతడు సజీవదహనం.. అసలేమైందంటే..



Updated Date - 2022-02-12T22:21:07+05:30 IST