పాత దుస్తులను అమ్మేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తే.. రూ.1.9 లక్షలు మటాష్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-22T02:36:07+05:30 IST

గతంలో ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేసేవారు.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దొంగలు ఇంట్లో కూర్చునే దర్జాగా నగదును కాజేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. చదువురాని వారితో పాటూ..

పాత దుస్తులను అమ్మేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తే.. రూ.1.9 లక్షలు మటాష్.. అసలేం జరిగిందంటే..

గతంలో ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేసేవారు.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దొంగలు ఇంట్లో కూర్చునే దర్జాగా నగదును కాజేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. చదువురాని వారితో పాటూ చదువుకున్నవారు, ఆఖరికి సెలబ్రిటీలను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. కేవలం ఒక్క క్లిక్‌తో లక్షలకు లక్షలకు కాజేస్తుంటారు. ఇటీవల ఇలాంటి కేసులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. ముంబైలో ఇటీవల ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. పాత దుస్తులను అమ్మాలని ప్రయత్నించిన మహిళకు చివరకు షాక్ ఇచ్చారు.. సైబర్ నేరగాళ్లు..


ముంబై వకోలా పోలీస్ స్టేషన్‌లో శాంటాక్రూజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ.. తన ఇంట్లోని పాత దుస్తులను అమ్మాలని అనుకునేది. వివిధ రకాలుగా ఆలోచించి.. చివరకు ఓఎల్ఎక్స్‌లో పెట్టింది. ఆ ప్రకటనను చూసిన ఓ కస్టమర్ మహిళకు ఫోన్ చేశాడు. దుస్తులకు సంబంధించిన నగదును పంపేందుకు ఆమెకు క్యూఆర్ కోడ్‌ను పంపాడు.

రోడ్డు ప్రమాదంలోనే ఈ కుర్రాడు చనిపోయాడని పోలీసులు కూడా ఫిక్సయ్యారు.. ఐదో రోజు బయటపడిన ఒక్క వీడియోతో సీన్ రివర్స్..


దాన్ని స్కాన్ చేయగానే.. ఆమెకు నగదు రావాల్సింది పోయి, ఆమె అకౌంట్‌లోని నగదు ఖాళీ అయింది. దీనిపై అతన్ని ప్రశ్నించడంతో.. పొరపాటు జరిగిందని, కొత్త క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండని పంపాడు. ఇలా పలు దపాలుగా మొత్తం రూ.1.9 లక్షలను అపహరించాడు. మోసపోయానని గ్రహించిన మహిళ.. సోమవారం వకోలా పోలీసులను ఆశ్రయించింది.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

Updated Date - 2021-12-22T02:36:07+05:30 IST