అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. బైక్‌పై ఇంటి దగ్గరకు చేరుకోగానే ఊహించని ట్విస్ట్.. అతడికి మైండ్ బ్లాక్..!

ABN , First Publish Date - 2021-09-10T00:48:33+05:30 IST

అమ్మాయి అడిగిందని లిఫ్ట్ ఇచ్చాడు..ఆ తరువాత ఊహించని ట్విస్ట్

అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. బైక్‌పై ఇంటి దగ్గరకు చేరుకోగానే ఊహించని ట్విస్ట్.. అతడికి మైండ్ బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయి చేయి చూపించి లిఫ్ట్ అడిగింది. అతడు ఆమె వద్ద బైక్ ఆపాడు. ఆమె వెంటనే తన కష్టాన్ని వెళ్లబోసుకుంది. తనను అర్జెంటుగా ఇంటి దగ్గర దిగబెట్టమని అభ్యర్థించింది. దీంతో.. కరిగిపోయిన అతడు ఆమెను ఇంటి వద్ద దిగబెట్టాడు. ఆ తరువాత.. ఆమె అతడికి ఊహించని ఝలక్ ఇచ్చింది. తన వెంటే ఇంట్లోకి రాకపోతే.. తనను అల్లరి పెడుతున్నవంటూ ఇరుగొపొరుగు వారిని పిలిచి గొల చేస్తానని హెచ్చరించింది. దీంతో దిమ్మెరపోయిన అతడు.. ఆమె చెప్పినట్టే లోపలికి వెళ్లాడు. ఆ తరువాత.. మరిన్ని దారుణాలు జరిగాయి. 


అప్పటికే ఆ ఇంట్లో ముగ్గురు యువకులు, ఓ యువతి ఇతడి కోసం ఎదురు చూస్తున్నారు. అతడు ఇంట్లో అడుగుపెట్టగానే అతడిపై దాడి చేశారు. బాధితుడి వద్ద ఉన్న డబ్బూ, బంగారు ఆభరణాలను లాగేసుకున్నారు. ఇదంతా వీడియోలోనూ రికార్డు చేశారు. ఆ తరువాత.. మరింత డబ్బుకావాలంటూ అతడిని బెదిరించారు. దీంతో.. అతడు నగదు తెస్తానంటూ అక్కడి నుంచి ఉపాయంగా బయటపడి చివరికి పోలీసులను ఆశ్రయించారు. జులై 14న ఇది జరిగింది. 

ఇవీ చదవండి:
సరిగ్గా 10 నెలల క్రితం పెళ్లి.. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ యువతి అత్తారింటి నుంచి ఫోన్.. అసలేం జరిగిందంటే..
KBC లో రూ.కోటి గెలిచిన అంధురాలి ఇంటికెళ్లి జర్నలిస్ట్‌నంటూ ఇంటర్వ్యూ మొదలు పెట్టాడో వ్యక్తి.. అరగంటలోనే అనూహ్య ట్విస్ట్


అయితే.. ఫిర్యాదు విషయం తెలుసుకున్న నిందితులు..  పోలీసు కేసు వాపసు తీసుకోవాలంటూ అతడిని ఫోన్లో బెదిరించారు. అతడు వినకపోవడంతో..వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. ఉత్తరప్రదేశ్ సుల్తాన్ పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితులు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. కాగా.. ఈ గ్యాంగ్ గతంలోనూ అనేక మందిని టార్గెట్ చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.  అయితే..పరువు పోతుందనే భయంతో బాధితులు ముందుకు రాకపోయి ఉండొచ్చని వారు అంటున్నారు. 

Updated Date - 2021-09-10T00:48:33+05:30 IST