Advertisement
Advertisement
Abn logo
Advertisement

9నెలల క్రితం కొడుక్కు పెళ్లి.. కాపాడండంటూ రాత్రిపూట కోడలి కేకలు.. కంగారుగా గదిలోకి ఆ తండ్రి వెళ్లి చూస్తే..

తొమ్మిది నెలల క్రితం కొడుక్కి పెళ్లి చేశాడు. వారి కాపురం సవ్యంగా సాగుతుండడంతో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. అయితే కారణాలు ఏంటనేది తెలీకున్నా.. ఇటీవల కొన్ని నెలలుగా కొడుకు, కోడలి ప్రవర్తనలో మార్పులు రావడం గమనించారు. అంతా అదే సర్దుకుంటుందిలే అనుకున్న క్రమంలో గురువారం రాత్రి అనుకోని ఘటన జరిగింది. రాత్రి సమయంలో కాపాడండి అంటూ కోడలి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె మామ విని కంగారుగా వారి గదికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. అసలు ఏం జరిగిందంటే..

జైపూర్ ఆదర్శ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివశంకర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తికి హేమంత్ సాహు(26) అనే కుమారుడు ఉన్నాడు. 9నెలల క్రితం కొడుక్కి హేమలత(21) అనే యువతితో వివాహం జరిపించారు. నవ దంపతులు అన్యోన్యంగా ఉండడం చూసి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కారణాలు ఏవని తెలీకున్నా.. కొన్ని నెలలుగా కొడుకు, కోడలి వ్యవహార శైలిలో మార్పులు రావడం గమనించారు. కొన్నాళ్లు పోతే అంతా సర్దుకుంటుందిలే అని అనుకున్నారు.

కూతురు బతుకుతుందని 2నెలలుగా ఎదురుచూపులు.. ఆ తల్లిదండ్రులు రోజూ చేసే పని చూసి..

ఈ క్రమంలో గత గురువారం రాత్రి కొడుకు గదిలో నుంచి కోడలు.. కాపాడండి అంటూ కేకలు వేయడం వినిపించింది. దీంతో ఏం జరుగుతుందో అని ఆమె మామ కంగారుగా వెళ్లి చూశాడు. అక్కడ కొడుకు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. చేతి నరాలు కట్ చేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అంతకుముందు కొడుకు, కోడలు విషం తాగినట్లు తెలిసింది. దీంతో చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు తెలిపారు. వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆడ వేషం ధరించి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు వల.. నమ్మకం ఏర్పడగానే ప్రేమ నాటకం.. అశ్లీల ఫొటోలతో..

ఇవి కూడా చదవండిImage Caption

19ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. ఒక్కసారిగా రూ.8కోట్లు దక్కడంతో.. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. దోచుకున్న అనంతరం వంట గదిలో చేసిన చిన్న పనితో.. చివరకు అక్కా చెల్లెళ్లు చేసిన నిర్వాకం.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని ఊరి బయటకు రమ్మని.. మరుసటి రోజు చూసేసరికి..ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్త అంత్యక్రియలు.. రెండు రోజుల తర్వాత కొడుకు బయటపెట్టిన నిజం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి.. ఏడాది తర్వాత అనుకోని ఘటన.. చివరకు కొడుకుతో సహా భార్య ఏం చేసిందంటే.. నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. చివరగా అతను చెప్పిన మాటలు విని.. ఆమె మైండ్ బ్లాక్..
Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement