Viral Video: పెంపుడు కుక్కపై ఈ మహిళ ప్రేమ చూడండి.. బేటా, అంటూ కౌగిలించుకుని ఎంత బాగా చూసుకుంటుందో..

ABN , First Publish Date - 2022-02-24T01:14:08+05:30 IST

. ఓ మహిళ తన పెంపుడు కుక్కకు బ్రూనో అని పేరు పెట్టుకుంది. దాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ బేటా అని పిలుస్తూ ప్రేమగా చూసుకుంటుంది. ఆ కుక్క కూడా చిన్న పిల్లల తరహాలో..

Viral Video: పెంపుడు కుక్కపై ఈ మహిళ ప్రేమ చూడండి.. బేటా, అంటూ కౌగిలించుకుని ఎంత బాగా చూసుకుంటుందో..

పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ అయింది. పలు రకాల జాతులకు చెందిన కుక్కలను లక్షలకు లక్షలు ఖర్చు చేసి మరీ కొంటూ ఉన్నారు. సొంత పిల్లలపై ఎంత ప్రేమ చూపిస్తారో.. అంతే ప్రేమను వాటిపై కూడా చూపిస్తున్నారు. స్నానం చేయించడం దగ్గర నుంచి ఆహారం వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవి దూరమైతే తట్టుకోలేనంతగా వాటిపై అభిమానం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన పెంపుడు కుక్కను కౌగిలించుకుని.. బేటా అంటూ పిలుస్తూ ప్రేమగా చూసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


bruno_thepawfection పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. ఓ మహిళ తన పెంపుడు కుక్కకు బ్రూనో అని పేరు పెట్టుకుంది. దాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ బేటా అని పిలుస్తూ ప్రేమగా చూసుకుంటుంది. ఆ కుక్క కూడా చిన్న పిల్లల తరహాలో ఆమె ఒడిలో పడుకోవడం ఆకట్టుకుంటుంది. "అన్ని నొప్పులూ పోయాయి... నా మమ్మీ నన్ను గట్టిగా కౌగిలించుకున్నప్పుడు... లవ్ యూ మా" అంటూ క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్టు చేశారు. చిన్న పిల్లలపై చూపించినంతగా ప్రేమ చూపిండం.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంది.

కుక్కే కదా తింటే పోలా అనుకుంది.. దెబ్బకు పులికి దిమ్మ తిరిగింది.. చూస్తే అవాక్కవుతారు..





Updated Date - 2022-02-24T01:14:08+05:30 IST