అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు.. పొద్దున్నే భార్యను పిలిస్తే గదిలోంచి నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-02-21T00:59:25+05:30 IST

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్-119లో ఉన్న ఆల్డెకో ఇన్విటేషన్ సొసైటీలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్‌, సోనమ్ సింగ్ దంపతులు.. తమ పదేళ్ల కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ ఓ..

అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు.. పొద్దున్నే భార్యను పిలిస్తే గదిలోంచి నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

వేడుకలు చేసుకునే సమయంలో కొన్నిసార్లు విషాధ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీంతో అప్పటిదాకా ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోతుంటుంది. ఆనందభాష్పాలు మాయమై బాధతో కూడిన కన్నీరు పెల్లుబుకుతుంది. విధి వక్రించిన సమయంలో ఇలాంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుటుంబంలో పుట్టిన రోజు వేడుకలు.. చివరికి విషాదాంతమయ్యాయి. భార్య పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి వేడుకలు నిర్వహించారు. పొద్దునే భార్యను ఎంత పిలిచినా గదిలో నుంచి స్పందన రాలేదు. చివరికి ఏం జరిగిందంటే..


ఈ ఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్-119లో ఉన్న ఆల్డెకో ఇన్విటేషన్ సొసైటీలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్‌, సోనమ్ సింగ్ దంపతులు.. తమ పదేళ్ల కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ ఓ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సోనమ్ పుట్టిన రోజు కావడంతో గురువారం అర్ధరాత్రి 12గంటలకు వేడుకలు నిర్వహించారు. స్నేహితులతో కలిసి అంతా సరదాగా గడిపారు. అయితే కేక్ కట్ చేసిన అనంతరం భార్యాభర్తల మధ్య ఏదో విషయమై గొడవ తలెత్తింది. కొంత సేపు వాగ్వాదం తర్వాత సోనమ్ సింగ్ తన గదిలోకి వెళ్లి పడుకుంది.

కొద్ది రోజుల్లో పెళ్లి.. డాబా మీద దుస్తులు ఆరేద్దామని వెళ్లిందా 20 ఏళ్ల యువతి.. ఊహించని రీతిలో..


ఉదయం సోనమ్ సింగ్ ఎంత సేపటికీ గది నుంచి బయటికి రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. తలుపు తట్టి పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో తలుపులను మరింత గట్టిగా బాదాడు. అయినా భార్య స్పందించకపోవడంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లాడు. లోపల భార్య ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించడంతో షాక్ అయ్యాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని అయ్యో పాపం.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

అప్పులు తీర్చేందుకు భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి రూ.7లక్షలకు డీల్.. చివరకు సీన్ రివర్స్..!

Updated Date - 2022-02-21T00:59:25+05:30 IST